Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆర్మీ కుటుంబాల నేపథ్యంగా మురళీ మోహన్ తో సుప్రీమ్ వారియర్స్ ప్రారంభం

Advertiesment
Dr. Murali Mohan, Harichandan, Davala Satyam, Baburao

దేవీ

, సోమవారం, 11 ఆగస్టు 2025 (17:35 IST)
Dr. Murali Mohan, Harichandan, Davala Satyam, Baburao
దాదాపు 800 మంది ఆర్మీ కుటుంబాలను కలిసి రెండున్నరేళ్లుగా స్క్రిప్ట్ మీద పని చేస్తూనే ఉన్నాం. అందరినీ ఆకట్టుకునేలా మా ‘సుప్రీమ్ వారియర్స్’ను ఆడియెన్స్ ముందుకు తీసుకు వస్తామ’ని దర్శకుడు హరిచందన్ అన్నారు.
 
డా. మురళీ మోహన్ ప్రధాన పాత్రలో ఆది అక్షర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సుప్రీమ్ వారియర్స్’. ఈ చిత్రానికి పెదపూడి బాబూ రావు నిర్మాతగా, హరి చందన్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. సోమవారం నాడు పూజా కార్యక్రమాలతో రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి దవళ సత్యం, బెల్లంకొండ సురేష్, దర్శకుడు వీర శంకర్, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, శివ రాజ్ పాటిల్, మార్కాపురం శివ కుమార్, శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. దవళ సత్యం, డా. మురళీ మోహన్ గౌరవ దర్శకత్వం వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం..
 
అనంతరం మురళీ మోహన్ మాట్లాడుతూ, ఈ మూవీ కథను డైరెక్టర్ హరి చందన్ చెప్పినప్పుడే నాకు ఎంతో నచ్చింది. ఈ మూవీలో నటిస్తుండటం ఆనందంగా ఉంది. ఇక నిర్మాత పెదపూడి బాబూ రావు నిర్మాతగా, నటుడిగా ఈ చిత్రంలో అందరినీ ఆకట్టుకోబోతోన్నారు. ఎన్నారై అయిన బాబూ రావు సినిమాల మీద ప్యాషన్ మీద ఇండస్ట్రీలోకి వచ్చారు. ఆయన మరెన్నో విజయవంతమైన చిత్రాల్ని అందించాలని కోరుకుంటున్నాను. ఈ ‘సుప్రీమ్ వారియర్స్’ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
 
దర్శక, నిర్మాత దవళ సత్యం మాట్లాడుతూ, బాబూ రావు మళ్లీ అమెరికా వెళ్లకుండా ఇక్కడే వరుసగా చిత్రాలు నిర్మించాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ హరి చందన్ చెప్పిన కథ నాకు ఎంతో నచ్చింది. పూర్తి స్క్రిప్ట్ రెడీ అయ్యాకే షూటింగ్‌కు వచ్చారు. డైరెక్టర్‌కి ఎంతో డెడికేషన్ ఉంది. మంచి ఆలోచనలతో, కష్టపడి సినిమా తీస్తే తప్పకుండా విజయం దక్కుతుంది. ఈ ‘సుప్రీమ్ వారియర్స్’ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
 
హీరో, నిర్మాత పెదపూడి బాబూ రావు మాట్లాడుతూ, సైఫ్, యాక్షన్ థ్రిల్లర్‌గా నిర్మిస్తున్నాం. ఇందులో సౌత్ నుంచి నార్త్ వరకు మంచి పేరున్న హీరోల్ని తీసుకుంటున్నాం. ఇందులో నేను ఓ లీడ్ పాత్రలో కనిపిస్తాను. మురళీ మోహన్ మరో పాత్రను పోషిస్తున్నారు. మా ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి. మురళీ మోహన్ గారు ‘అతడు’ చిత్రంతో నాకు నటుడిగా జన్మను ఇచ్చారు. అందరినీ ఆశ్చర్యపరిచేలా, ఆకట్టుకునేలా మా సినిమా ఉంటుంది. త్వరలోనే నటీనటుల వివరాల్ని ప్రకటిస్తామ’ని అన్నారు.
 
దర్శకుడు హరి చందన్ మాట్లాడుతూ* .. ‘కరోనా టైంలో ఈ కథను అనుకున్నాం. తైవాన్ మీద జరిగిన దాడి తరువాత ఈ కథను రాయడం మొదలు పెట్టాను. 8 పాత్రల చుట్టూ జరిగే ఈ కథలో మురళీ మోహన్ గారు ఇది వరకు ఎన్నడూ కనిపించనటు వంటి కారెక్టర్‌ను పోషిస్తున్నారు. నిర్మాత బాబూ రావు కూడా మంచి పాత్రను పోషిస్తున్నారు. మిగిలిన పాత్రల కోసం కొంత మంది హీరోల్ని సంప్రదించాం. త్వరలోనే వాటి వివరాల్ని ప్రకటిస్తాం. సైఫై, యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతోన్న ఈ చిత్రంలో మిలటరీ, ఆర్మీ కుటుంబాల ఎమోషన్స్ ఎక్కువగా చూపిస్తాం. మేం దాదాపు 800 మంది ఆర్మీ కుటుంబాలను ప్రత్యక్షంగా కలిశాం. రెండున్నరేళ్లుగా ఈ స్క్రిప్ట్ మీద పని చేస్తూనే ఉన్నాం అన్నారు.
 
నటీనటులు : మురళీ మోహన్, బాబూ రావు, మహిమా చౌదరి, కల్పన, ఆదిత్య ఓం, పృథ్వీరాజ్, దవళ సత్యం, వీరేంద్ర చౌహాన్, రాజ్ పాల్ యాదవ్, మోహన్ శర్మ తదితరులు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శివుడు అనుగ్రహిస్తే ప్రభాస్ పెళ్లి త్వరలోనే జరుగుతుంది.. : పెద్దమ్మ శ్యామలా దేవి (Video)