Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జ్యోతి సీఎన్సీతో భాగస్వామ్యం కుదుర్చుకున్న కోటక్ మహీంద్రా బ్యాంక్

Advertiesment
Kotak Mahindra

ఐవీఆర్

, సోమవారం, 11 ఆగస్టు 2025 (16:56 IST)
కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ (కేఎంబీఎల్) భారతదేశంలోని ప్రముఖ సీఎన్సీ యంత్ర తయారీదారులలో ఒకటైన జ్యోతి సీఎన్సీతో ఒక వ్యూహాత్మక ఒప్పందాన్ని ప్రకటించింది. ఇది మెషిన్ టూల్ పరిశ్రమలోని ఎంఎస్ఎంఈలకు స్టాండ్ అలోన్ ప్రాతిపదికన కస్టమైజ్ చేసిన ఎక్విప్మెంట్ ఫైనాన్సింగ్ పరిష్కారాలను అందిస్తుంది.
 
అధునాతన సీఎన్సీ యంత్రాలలో పెట్టుబడి పెట్టాలనుకునే వ్యాపార సంస్థలకు మూలధన ప్రాప్యతను సులభతరం చేయడం, వేగవంతం చేయడం ఈ భాగస్వామ్యం లక్ష్యం. ఈ ఏర్పాటు కింద కోటక్ మహీంద్రా బ్యాంక్ ₹3 కోట్ల వరకు పరికరాల రుణాలను డిజిటల్‌గా అందిస్తుంది. ఇది వేగవంతమైన, మరింత సౌకర్యవంతమైన ఫైనాన్సింగ్‌కు వీలు కల్పిస్తుంది.
 
కోటక్ మహీంద్రా బ్యాంక్ బిజినెస్ బ్యాంకింగ్, అఫ్లుయెంట్, ఎన్ఆర్ఐ హెడ్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ప్రెసిడెంట్ రోహిత్ భాసిన్ మాట్లాడుతూ, ఈ ఏర్పాటు ఎంఎస్ఎంఈలను వాటి వృద్ధి యొక్క ప్రతి దశలోనూ మద్దతు ఇవ్వడానికి మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. కస్టమైజ్డ్ ఫైనాన్సింగ్ పరిష్కారాలను అందించడం ద్వారా, తయారీదారులు కార్యకలాపాలను అధికం చేయడానికి, అత్యాధునిక సాంకేతిక తను స్వీకరించడానికి, ఉత్పాదకతను పెంచడానికి సాధికారత కల్పించాలని మేం లక్ష్యంగా పెట్టుకు న్నాం అని అన్నారు.
 
ఈ చొరవ విస్తృత శ్రేణి ఎంఎస్ఎంఈలకు ప్రయోజనం చేకూర్చడానికి రూపొందించబడింది, వాటిలో:
- పెద్ద ఆటోమొబైల్ తయారీదారులకు ఓఈఎం సరఫరాదారులు
- పరిమిత యంత్రాలతో చిన్న స్థాయిలో పనిచేసే జాబ్ వర్కర్స్
 
జ్యోతి సీఎన్సీ ఆటోమేషన్ లిమిటెడ్ వ్యవస్థాపకులు, ఛైర్మన్, ఎండీ పరాక్రమ్‌సిన్హ్ జి. జడేజా మాట్లాడుతూ, మా వినియోగదారులకు సజావుగా ఫైనాన్సింగ్‌ను అందించడానికి కోటక్ మహీంద్రా బ్యాంక్‌తో సహకరించడానికి మేం సంతోషిస్తున్నాం. ఈ చొరవ వారి వ్యాపార ఆకాంక్షలకు మద్దతు ఇవ్వడమే కాకుండా భారతదేశంలో ప్రెసిషన్ తయారీ మొత్తం పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది అని అన్నారు.
 
ఈ ఏర్పాటు ఎంఎస్ఎంఈలకు ప్రాధాన్యత గల బ్యాంకింగ్ భాగస్వామిగా ఉండాలనే కోటక్ విస్తృత వ్యూహా నికి అనుగుణంగా ఉంటుంది. పరిశ్రమలలో వృద్ధి, స్థితిస్థాపకతను పెంచే వినూత్న ఆర్థిక పరిష్కారాలను అందిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మనిషిని చూసి జడుసుకుని తోక ముడిచి పరుగులు తీసిన పులి (video)