Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మనిషిని చూసి జడుసుకుని తోక ముడిచి పరుగులు తీసిన పులి (video)

Advertiesment
Man in front of Tiger

ఐవీఆర్

, సోమవారం, 11 ఆగస్టు 2025 (16:31 IST)
కొన్నిసార్లు క్రూర జంతువులు కూడా మనుషులను చూసి జడుసుకుని పారిపోతుంటాయి. వాస్తవానికి చాలా జంతువులు మనుషులను చూస్తే భయపడుతుంటాయని చెబుతుంటారు. ఐతే మనిషే వాటిని చికాకు పెడితే మాత్రం దాడి చేస్తాయని అంటారు. అందులో వాస్తవం ఎంత వున్నదన్నది పక్కన పెడితే... ఓ వ్యక్తిని చూసిన పులి తోక ముడిచి పారిపోయింది.
 
ఈ ఘటన వీడియోలో రికార్డయ్యింది. రాత్రి వేళ భోజనం చేసిన ఓ వ్యక్తి కాస్తంత వ్యాహ్యాళికి వెళ్లివద్దామని గేటు వరకూ వచ్చాడు. ఇంతలో అటుగా పులి కూడా వస్తోంది. అటు పులి ఇటు మనిషి ఎదురుపడ్డారు. విచిత్రంగా మనిషిని చూసిన పులి ఏమని భ్రమించిందో తెలియదు కానీ తోక ముడిచి పరుగులు తీసింది. ఇక క్రూర జంతువులంటే భయపడే మనిషి కూడా ఇటువైపు పరుగులు తీసాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు. ఒక జంతువును చూసిన మరో జంతువు. రెండూ ఒకరి ముఖం ఒకరు చూసుకుని పారిపోయాయి అంటూ సెటైర్లు పేలుస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుపతి కిరాణాకు మించి ఇన్‌స్టామార్ట్, 10-నిమిషాల్లో వస్తువులు డెలివరీ