Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఘనంగా ప్రారంభమైన సౌండ్ (మల్టీ బ్రాండ్)' చిత్రం

Advertiesment
ఘనంగా ప్రారంభమైన  సౌండ్ (మల్టీ బ్రాండ్)' చిత్రం
, గురువారం, 11 నవంబరు 2021 (16:04 IST)
Arjun Warahi, Rekha Nirosha, Clap by Bhimineni Srinivas Rao
కె.సాయి చంద్రిక సమర్పణలో శ్రీ సాయి వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ (SSVCC) పతాకంపై అర్జున్ వారాహి, రేఖా నిరోషా జంటగా కేవీ చౌదరి దర్శకత్వంలో కె.రవీంద్ర నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం1చిత్రం "సౌండ్" (మల్టీ బ్రాండ్) అనేది క్యాప్షన్.
 
ఈ చిత్రం పూజా కార్యక్రమం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో సినీ అతిరదుల సమక్షంలో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన దర్శకుడు భీమినేని శ్రీనివాస్ రావు ముహూర్తపు సన్నివేశానికి హీరో, హీరోయిన్ పై క్లాప్ కొట్టగా, నిర్మాత అచ్చిరెడ్డి దర్శక, నిర్మాతకు స్క్రిప్ట్ అందించారు.  మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నిర్మాత వాసు వర్మ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
 
అనంతరం చిత్ర దర్శకుడు కేవీ చౌదరి మాట్లాడుతూ, ఆద్యంతం వినోదాత్మ‌కంగా తెరకెక్కుతున్న మా మూవీని ఫ్యామిలీతో కలసి హ్యాపీగా చూసేలా తెరకెక్కిస్తున్నాం. మన జీవితంలో 'సౌండ్' అనేది చాలా కామన్ ప‌దం. అందుకే  సినిమాకు ఈ క్యాచీ టైటిల్ పెట్టడం జరిగింది. ఇందులో చాలా హెవీ ఫన్ ఉంటుంది. ఈ నెల 15 నుంచి షూట్ కు వెళ్తున్నాం.  హైదరాబాద్, వైజాగ్ లో రెండు షెడ్యూల్ లలో షూట్ చేసి సినిమాను పూర్తి చేస్తాము" అని అన్నారు
 
చిత్ర నిర్మాత కె.రవీంద్ర మాట్లాడుతూ, చిత్ర దర్శకుడు కేవీ చౌదరి చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా నిర్మిస్తున్నాను. ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో  సెంటిమెంట్ కూడా ఉంటుంది. ఫ్యామిలీ అందరు కలిసి చూసేలా మా సినిమా ఉంటుంది. అందరి ఆశీస్సులు మా బేనర్ కి సినిమాకి ఉండాలని కోరుకుంటున్నాం." అన్నారు.
 
హీరో అర్జున్ వారాహి మాట్లాడుతూ, .. మా "సౌండ్ " అందరికీ రీ సౌండ్ వచ్చేలా ఉంటుంది.  కథ పరంగా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్.  మాస్ ఎలిమెంట్ కూడా పుష్కలంగా ఉంటాయి. సౌండ్ అనే పేరుకు తగ్గ సినిమా ఇది. ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.
 
హీరోయిన్ రేఖా నిరోషా మాట్లాడుతూ.. త్వరలో షూటింగ్ కు వెళ్తున్నాము. ఈ సినిమా చూసిన వారంతా చాలా ఫన్ ఫీలవుతూ చాలా ఎంజాయ్ చేస్తారు. అలాంటి కథ ఇది. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం ఇచ్చిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు అని అన్నారు.
 
అర్జున్ వారాహి, రేఖా నిరోషా, జీవ, కళ్యాణ్ తేజ తదితరులు న‌టించ‌నున్న ఈ సినిమాకు  సమర్పణ : కె.సాయి చంద్రిక ప్రెజెంట్స్, నిర్మాత :  కె. రవీంద్ర, రచన -దర్శకుడు : కేవీ చౌదరి, మెరామెన్ :పవన్ గుండుకు,  మ్యూజిక్  : కపిల్ కుమార్,  ఎడిటింగ్ :  జె ప్రదీప్ దొడ్డి,  సాహిత్యం :  వనమాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జెట్ స్పీడ్ వేగంతో 'ఆదిపురుష్' షూటింగ్ పూర్తి