Suman, prethi, chowhan, etc
గోర్ జీవన్ చిత్రంతో హీరోగా, దర్శకుడుగా మంచి పేరు తెచ్చుకున్న కేపియన్ చౌహాన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తోన్న తాజా చిత్రం సేవాదాస్. తెలుగు,బంజారా భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రీతి అశ్రాని, రేఖా నిరోషా నాయికలుగా నటిస్తున్నారు. సీనియర్ నటులు సుమన్, భానుచందర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హాథీరామ్ బాలాజీ క్రియేషన్స్ పతాకంపై వినోద్ రైనా ఎస్లావత్, సీతారామ్ బాదావత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బోలే సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రంలోని బంజారా భాషకు సంబంధించిన టైటిల్ సాంగ్‌ను హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.
ఈ పాటను స్వరాగ్ ఆపించారు. నిజాయితీకి మారుపేరైన ఓ తండ్రి బాటలో నడిచే కొడుకు కథ ఎలా మొదలైంది? ఎలా ముగిసింది? అనేది సేవాదాస్ చిత్ర కథాంశం. ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆఖరి దశలో ఉన్నాయి. త్వరలో ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్ రిలీజ్ చేసిన అనంతరం నటుడు సుమన్ మాట్లాడుతూ, నేను ఇప్పటి వరకు ఎనిమిది భాషల్లో నటించాను. బంజారా భాషలో రూపొందుతోన్న ఈ సినిమా తొమ్మిది భాషల్లో నటించినట్లు అవుతుంది. ఇక ఈ సినిమా లో బంజారా కమ్యూనిటీకి ఆది గురువైన సేవాలాల్ పాత్రలో నటించాను. ఎక్కడివారినైనా కనెక్ట్ చేసేది ఒక సినిమా మాత్రమే. నా వంతు ప్రయత్నంగా బంజారా కమ్యూనిటీని నలు దిశలా తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ సినిమాలో నటించాను. ఇక చౌహాన్ ఎక్కడా తడబడకుండా ఎంతో అనుభవం ఉన్నహీరోలా, దర్శకుడులా సినిమాను తీర్చిదిద్దాడు. ఇందులో బోలే నాలుగు అద్భుతమైన పాటలు అందించాడు. కమిర్షియల్ అంశాలతో పాటు బంజారా సెంటిమెంట్‌తో ఈ సినమా అందరికీ కనెక్టయ్యేలా ఉంటుంది` అన్నారు.
దర్శకుడు, హీరో కేపియన్ చౌహాన్ మాట్లాడుతూ,``గోర్ జీవన్` సినిమాతో తెలుగు ప్రేక్షకులు, బంజరా కమ్యూనిటీ వాళ్లు నన్ను ఎంతగానో ఆదరించారు. ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో రెండో చిత్రంగా తెలుగు, బంజారా భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నా. త్వరలో ఆడియో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం`` అన్నారు.
నిర్మాతలు వినోద్ రైనా ఎస్లావత్, సీతారామ్ బాదావత్ మాట్లాడుతూ, బంజారా చిత్రాలకు చౌహాన్ ఐకాన్ అని చెప్పవచ్చు. ఆయన స్పూర్తితో ప్రస్తుతం చాలా బంజారా చిత్రాలు వస్తున్నాయి. ఖర్చుకు ఎక్కడా రాజీ పడకుండా సినిమాను తెరకెక్కించాం. త్వరలో ఆడియో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం`` అన్నారు.
సంగీత దర్శకుడు బోలే మాట్లాడుతూ, ఇందులో నాలుగు పాటలు కూడా చాలా బాగా కుదిరాయి. ఈ రోజు టైటిల్ సాంగ్ రిలీజ్ అయింది. పాట ఎంత బాగా వచ్చిందో పిక్చరైజేషన్ కూడా బాగా కుదిరింది. సుమన్ నటించడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. చౌహాన్ ఈ సినిమా కోసం ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నాడు అన్నారు.
నటుడు డా.సంపత్ నాయక్ మాట్లాడుతూ, నేను ఇందులో నెగిటివ్ పాత్రలో నటించాను. ఈ సినిమాకు మూల కారణమైన చౌహాన్ ఇలాంటి మరెన్నో మంచి చిత్రాలు చేయాలన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో నటుడు రంగరాజన్, సెకండ్ హీరోయిన్ రేఖా నిరోషా, దిలీప్ రాథోడ్, బిక్షు నాయక్, విజయ్ ఠాగూర్ తదితరులు పాల్గొని సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు.