Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సస్పెన్స్ & యాక్షన్ థ్రిల్లర్ నేప‌థ్యంలో - కటారి కృష్ణ

Advertiesment
Katari Krishna
, శనివారం, 6 నవంబరు 2021 (15:57 IST)
Krishna, Muralimohan, bharani and others
కృష్ణ, చాణక్య, రేఖా నిరోష, యశ్న చౌదరి, స్వాతి మండల్ త‌దిత‌రులు న‌టిస్తున్న చిత్రం `కటారి కృష్ణ`. ప్రకాష్ తిరుమల శెట్టిని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జాగో స్టూడియో' పతాకంపై  పి.ఏ. నాయుడు, నాగరాజు తిరుమల శెట్టి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్  ఆవిష్క‌ర‌ణ హైద‌రాబాద్‌లో జ‌రిగింది. 
 
ముఖ్య అతిథి మురళీ మోహన్ గారు మాట్లాడుతూ, ఇంతకుముందు సినిమా అంటే కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమిత మయ్యేది. కానీ ఇవాళ్టి రోజున తెలుగు ఇండస్ట్రీకు కొత్త బ్లడ్ చాలా వచ్చింది. అందుకే ఈనాడు  ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న  తెలుగు సినిమాకు మంచి గుర్తింపు లభించడమే గాక తెలుగు ఇండస్ట్రీ ఇంత గొప్పగా ఉంటుందా అనే స్టేజ్ కు ఎదిగింది. కటారి కృష్ణ  ట్రైలర్ చాలా బాగుంది.రొమాంటిక్ సస్పెన్స్ అండ్ యాక్షన్ థ్రిల్లర్  గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించి ఈ చిత్ర  యూనిట్ కు మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.. 
 
తనికెళ్ళ భరణి మాట్లాడుతూ, మా కాలంలో దర్శకుడు అవ్వాలంటే చాలా కష్ట పడవలసి వచ్చేది. కానీ ఈ రోజు డిజిటల్ మీడియా పెరగడంతో కొత్తకొత్త కథలతో యూత్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రేక్షకులు మెచ్చే కథతో సినిమా చేస్తే అడకపోవడం అనే బాధ లేకుండా థియేటర్స్ లతో పాటు ఓటిటి లో కూడా విడుదల చేసి మంచి పేరు సంపాదించు కుంటున్నారు. యూత్ కు మెచ్చే విధంగా తీసిన ఈ చిత్ర ట్రైలర్,పాటలు బాగున్నాయి త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని అన్నారు.
 
చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ, వైవిధ్యమైన కథాంశంతో రొమాంటిక్ సస్పెన్స్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా  రూపొందించిన ఈ చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్ లు, చేజింగ్ సీక్వెన్స్ లు, థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ ఎన్నో ఉన్న ఈ చిత్రం ప్రేక్షకులందరికీ తప్పక నచ్చుతుంది. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్ చివరివారంలో థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. 
 
చిత్ర దర్శకుడు ప్రకాష్ తిరుమలశెట్టి మాట్లాడుతూ, యూత్ ని బాగా ఆకట్టుకునే అంశాలతో ఈ చిత్రం రూపొందిందని తెలిపారు. 
చిత్ర హీరో కృష్ణ మాట్లాడుతూ, ఇలాంటి మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లాంఛనంగా ప్రారంభ‌మైన మెగాస్టార్ చిరంజీవి 154వ‌ చిత్రం