బాలీవుడ్ నటుడు, బిగ్‌బాస్-13వ సీజన్ విజేత సిద్ధార్థ్ శుక్లా ఎందుకు చనిపోరాన్న చర్చ సాగుతోంది. నిజానికి సిద్ధార్థ్ గుండెపోటు కారణంగా చనిపోయారని వెల్లడించారు. అయితే, ఆయన మృతిలో ఏదో మర్మముందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
సాధారణంగా గుండెపోటు అనగానే 60 సంవత్సరాల తర్వాత వస్తుందని అంటుంటారు. కానీ ఇటీవల కాలంలో చాలామంది ఒత్తిడి కారణంగా, భరించలేక గుండెపోటుకుగురయ్యే వారి సంఖ్య అధికమవుతున్నారు. ఇలాంటి వారిలో సిద్ధార్థ్ శుక్లా ఒకరు.
నిజానికి ఈయన ఫిట్నెస్‌కు చాలా ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే. చనిపోయే ముందు రోజు కూడా సిద్ధార్థ్ బాగా వర్కౌట్ చేసినట్లు సమాచారం. ముందు రోజు రాత్రి 8 గంటల సమయంలో ఇంటికి వచ్చిన తర్వాత, పది గంటలు అప్పుడు జాగింగ్‌తో పాటు మరికొన్ని వర్కౌట్ చేశాడని తెలుస్తోంది. అనంతరం నిద్రపోవడానికి వెళ్ళాడట.
తెల్లవారుజామున 3 గంటలకు ఛాతీలో నొప్పి రావడంతో వెంటనే తన తల్లికి సమాచారం కూడా ఇచ్చాడు. ఇక ఆమె స్వయంగా సిద్ధార్థకు నీళ్లు కూడా తాగించింది. నిద్రపోయిన సిద్ధార్థ నిద్ర నుంచి మేలుకో లేదని ఇక హాస్పిటల్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఆ తర్వాత సిద్ధార్థ్ గురువారం ఉదయం 10.30 గంటల సమయంలో చనిపోయారు.
అయితే, సిద్ధార్థ్ మృతికి వైద్యుల చెబుతున్నది ఏమింటే.. ఎక్కువగా వర్కౌట్లు చేయడం వల్ల ప్రాణానికే ప్రమాదమని చెప్పినప్పటికీ, ఏమాత్రం లెక్క చేయక పోవడంతో ఇలా జరిగిందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో నిజమెంతో వైద్యులకే తెలియాలి.