కథానాయకుడు వరుణ్‌తేజ్ ప్రస్తుతం దృష్టంతా `గని` సినిమా పైనే వుంది. ఆడతాపాడతా చేసే పాత్ర కాదు. ఆల్రెడీ అలాంటి పాత్రను `ఎఫ్3`లో చేసేస్తున్నాడు. అది ముగింపు దశకు వచ్చేస్తుంది. అందుకే చాలా కాలం గేప్‌తో మరలా గని సినిమాకోసం శాయశక్తులా జిమ్‌లో కష్టపడుతున్నాడు. ఈరోజే జిమ్‌లో తాను చెమటోడ్చి కష్టపడుతున్న విధానాన్ని వీడియో రూపంలో తన సోషల్‌మీడియాలో వరుణ్‌తేజ్ విడుదల చేశారు. గనిలో ఆయన పాత్ర బాక్సర్. ఇందుకోసం హాలీవుడ్ బాక్సర్ సంరక్షణలో శిక్షణ తీసుకున్నట్లు తెలుస్తోంది.
బాక్సింగ్ నేపథ్యంలో పలు కథలు వచ్చినా ఈ సినిమా ప్రత్యేకతను సంతరించుకుంటున్నదని చిత్ర దర్శకుడిగా పరిచయం అవుతున్న కిరణ్ తెలియజేస్తున్నారు. నిన్ననే ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా గని తన కెరీర్‌ను మలుపుతిప్పుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్ల పై సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. వరుణ్ తేజ్, ఉపేంద్ర, సునీల్ శెట్టి, సాయి మంజ్రేకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.