Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆస్కార్ బరిలోకి శ్వేతబసు ప్రసాద్ సినిమా.. వెల్లువెత్తుతున్న ఆఫర్లు? (video)

webdunia
గురువారం, 17 అక్టోబరు 2019 (14:53 IST)
''కొత్త బంగారు లోకం'' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్వేత బసు ప్రసాద్.. ఆపై ఓ కేసులో ఇరుక్కుంది. ఆపై శ్వేతా పెళ్లి చేసుకోవడం.. సినిమాలకు దూరం కావాలని భర్త చెప్పడంతో నటనకు గుడ్ బై చెప్పేసింది. అయితే బాలీవుడ్ సినిమాలతో శ్వేతా బసు ప్రసాద్ రీ ఎంట్రీ ఇవ్వనుంది. 'ది తాష్కెంట్ ఫైల్స్' సినిమాలో నటించడం ఆమె ఓ వరంలా మారింది. 
 
ఈ ముద్దుగుమ్మ నటించిన ఈ సినిమా ఆస్కార్‌కి నామినేట్ అయ్యింది. దీంతో బాలీవుడ్‌లో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయట. ఇంకా తెలుగులో పేరున్న నిర్మాతలు శ్వేతబసుతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. 
 
శ్వేతా బసు నటించిన ఈ సినిమా ఆస్కార్‌కి వెళ్ళనుండడంతో ఆమె ఆనందానికి హద్దులు లేవు. ఆమెతో పాటు కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో శ్వేతాబసుకి మళ్ళీ మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
 

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

భర్త దర్శకత్వంలో భార్య... ముద్దుసీన్లు ఉంటాయా?