Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అక్కినేని నాగేశ్వరరావు 101వ జయంతి- 4K డాల్బీ అట్మాస్‌తో శివ రీ రిలీజ్.. నాగార్జున ప్రకటన

Advertiesment
Shiva

డీవీ

, శనివారం, 20 సెప్టెంబరు 2025 (23:01 IST)
Shiva
నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి 101వ జయంతి సందర్భంగా శివ 4K డాల్బీ ఆట్మాస్ రీ రిలీజ్ డేట్‌ని కింగ్ నాగార్జున అనౌన్స్ చేశారు. ఈ సినిమా నవంబర్ 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. 1989లో విడుదలైన శివ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో నిర్మాతలు అక్కినేని వెంకట్ అండ్ సురేంద్ర యార్లగడ్డ నిర్మించారు. ఇండియన్ సినిమాను బిఫోర్ శివ అండ్ ఆఫ్టర్ శివగా రీడిఫైన్ చేసిన శివ గ్రేటెస్ట్ ఇండియన్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
 
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. నాన్నగారు ఎప్పుడూ సినిమాకి తరాలకు మించి జీవించే శక్తి ఉందని నమ్మారు. శివ అలాంటి ఒక చిత్రం. నవంబర్ 14న శివ పూర్తిగా కొత్త అవతార్‌లో 4K డాల్బీ అట్మాస్‌తో మళ్ళీ బిగ్ స్క్రీన్ పైకి తీసుకురావడం కథలను ఎప్పటికీ సజీవంగా ఉంచాలనే నాన్న గారి కలకు నివాళి. 
 
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన కల్ట్‌ క్లాసిక్‌ శివ మళ్లీ బిగ్ స్క్రీన్ అదరగొట్టడానికి సిద్ధమైంది. ఈసారి అద్భుతమైన 4K విజువల్స్‌తో పాటు, ఇప్పటి వరకు ఏ రీ-రిలీజ్‌ సినిమాకు లేని విధంగా, డాల్బీ ఆట్మాస్ సౌండ్‌తో ప్రేక్షకులను అలరించబోతోంది. మోనో మిక్స్‌లో ఉన్న శివ సౌండ్‌ను అత్యాధునిక ఏఐ టెక్నాలజీతో రీ-మాస్టర్‌ చేసి, అడ్వాన్స్ డాల్బీ ఆట్మాస్‌లోకి మార్చారు.
 
శివ ప్రత్యేకత అప్పుడు తన టైమ్స్ లోని సాంప్రదాయాలను ధైర్యంగా చెరిపేసిన విధానం మాత్రమే కాదు, అప్పట్లోనే చేసిన అత్యాధునిక సౌండ్ డిజైన్ లోనూ ఉంది. ఇప్పుడు రీ-రిలీజ్‌లో తీసుకొచ్చిన టెక్నాలజీ అప్‌గ్రేడ్స్‌తో ఈ సినిమా మరో కొత్త అనుభవాన్ని అందించబోతోంది.
 
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ..ఈ సారి ప్రేక్షకులు ఇంతకుముందు ఎప్పుడూ వినని విధంగా, పూర్తిగా కొత్త అనుభూతిని పొందుతారు. ఆ అనుభవాన్ని చూడటానికి ఎదురుచూస్తున్నాను.. అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Dude: ప్రదీప్ రంగనాథన్ పాన్ ఇండియా ఫిల్మ్ డ్యూడ్ నుంచి బాగుండు పో రిలీజ్