Ravi Basrur, M.V. Radhakrishna, James W. Kommu
శివరాజ్ కుమార్, శిథిల్ శెట్టి, నాగశ్రీ తదితరులు నటించిన కన్నడ సినిమా వీర చంద్రహాస. ఇటీవలే విడుదలై వందరోజులు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమాను తెలుగులో ఎమ్‌వీ రాధాకృష్ణ, జేమ్స్ డబ్యూ కొమ్ము విడుదల చేస్తున్నారు. హోంబలె ఫిల్మ్స్ సమర్పణలో, రవి బస్రూర్ రూపొందించిన వీర చంద్రహాస సెప్టెంబర్ 19న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రవి బస్రూర్ మాట్లాడుతూ..ఇదొక రేటెడ్ స్టోరీ. యక్షగానం కల్చర్ ను రిప్రజెంట్ చేసేలా ఉంటుంది. ఈ సినిమా నా 12 సంవత్సరాల కల. విజయం సాధించిన ప్రతి ఒక్కరి స్టోరీ ఇది. జీరో నుంచి హీరోగా ఎలా అవుతారు అనే డెడికేషన్ ఈ కథలో ఉంటుంది. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా సినిమా ఉంటుంది. ఒక సినిమా చేయడంతో సుమారు 4000 మందికి ఉపాధి కలుగుతుంది. మ్యూజిక్ చేయడంతో వచ్చే డబ్బును సరైన మార్గంలో ఉపయోగించాలనే ఉద్దేశంతో ఏడాదికి ఒక సినిమాను దర్శక నిర్మాతగా చేయాలనుకునే లక్ష్యం పెట్టుకున్నాను.
ఇది నా ఆరో సినిమా. దీని ద్వారా కొత్త వాళ్లను ఎంకరే చేస్తాను. మనం ఏ స్థాయికి వెళ్ళినా అన్న మూలాలను మర్చిపోకూడదని నమ్ముతాను. యక్షగాన కలతో రూపొందిన ఈ చిత్రంతో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాను. మన కల్చర్ ను కాపాడుకునేలా ఈ చిత్రం ఉంటుంది. ఎనిమిదో తరగతి ఫెయిల్ అయిన వాడిని, ఉగ్రం సినిమా వచ్చేవరకు నా జీవితంలో అన్ని డిజాస్టర్లే. నాకు అవకాశం ఇచ్చిన ప్రశాంత్ నీల్ గారు నాకు దేవుడితో సమానం. నన్ను నమ్మిన ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అని అన్నారు.
నిర్మాత ఎమ్.వీ.రాధాకృష్ణ మాట్లాడుతూ.. కన్నడలో విడుదలై వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని మేము తెలుగులో విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇదొక భారతీయ నాగరికత సంస్కృతికి సంబంధించిన యక్షగానం అనే కాన్సెప్ట్ తో రూపొందింది. కే జి ఎఫ్, సలార్ లాంటి చిత్రాలకు తనదైన సంగీతంతో అలరించిన రవి బస్రూర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు ఆయనే సంగీత దర్శకులుగా వ్యవహరించారు. కన్నడలో పెద్ద విజయం సాధించిన ఈ చిత్రం కచ్చితంగా తెలుగు ప్రేక్షకులను ఆదరిస్తుంది. వీర చంద్రహాస విజయదరహసం ఖాయమని నమ్ముతున్నాం అని అన్నారు.
జేమ్స్ డబ్యూ కొమ్ము మాట్లాడుతూ.. రవి బస్రూర్ తో నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇప్పుడు ఆ ప్లేస్ నుంచి వచ్చిన సంగీత దర్శకుడితో వర్క్ చేయడం నాకు మెమొరబుల్ ఎక్స్పీరియన్స్. రవి బస్రూర్ అంటే.. ఒక ఇన్స్టిట్యూషన్. ఆయన సొసైటీ మీద ప్రేమ ఉన్న వ్యక్తి. బస్రూర్ అనే విలేజ్ కి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు. అలాంటి వ్యక్తితో ట్రావెల్ చేయడం చాలా సంతోషంగా ఉంది. సెప్టెంబర్ 19 విడుదలవుతున్న ఈ చిత్రం కచ్చితంగా అందర్నీ అలరిస్తుందని నమ్ముతున్నాం" అని చెప్పారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సురేష్, పి ఆర్ ఓ హర్ష పాల్గొన్నారు.