Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Upasana: ఉపాసనకు సీమంత వేడుక నిర్వహించిన మెగా కుటుంబం

Advertiesment
Seemantham celebrations done for Upasana on  megha family

చిత్రాసేన్

, గురువారం, 23 అక్టోబరు 2025 (12:14 IST)
Seemantham celebrations done for Upasana on megha family
మెగాస్టార్ చిరంజీవి ఇంటిలో దీపావళినాడు వేడుక జరిగింది. ఉపాసనకు గంధం పూసి దీపంతో మెగా మహిళలు హారతి పడుతూ పాటులు పాడారు. ఉపాసన సీమంతం వేడుక జరుపుకున్నారు. ఈ వేడుకలో నాగార్జున, అమల, పవన్ కళ్యాణ్ భార్య, నాగబాబు కుటుంబం, ఉపాసన తల్లిదండ్రులు హాజరయ్యారు. ఉపాసన తండ్రి చిరంజీవికి వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని అందజేశారు. 
 
రామ్ చరణ్, ఉపాసన జంట మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయం తెలిసిన మెగా ఫ్యామిలీ వారిని ఆశీర్వదించేందుకు తరలివచ్చారు. ఈ దీపావళి పర్వదినాన తమ ఇంట్లో ఆనందం రెట్టింపు అయ్యింది.. ప్రేమానురాగాలు రెట్టింపు అయ్యాయి. కుటుంబసభ్యులు ఆశీస్సులతో వారు పరవశించిపోయారు. 
 
దీనికి సంబంధించిన  వీడియోను ఉపాసన తన సోషల్ మీడియాలో పంచుకుతంది. మెగా ఫ్యామిలీ సభ్యులు ఉపాసనకు స్వీట్స్ తినిపిస్తూ ఆమెను ఆశీర్వదించారు. మరోసారి తండ్రి కాబోతున్న చరణ్ ను నీహారిక తోపాటు పలువురు హ్రుదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Fauzi: ప్రభాస్, హను రాఘవపూడి హను చిత్రానికి ఫౌజీ ఖరారు