Fauzi is the Prabhas Title
మన చరిత్రలో మరుగునపడిన అధ్యాయాల నుండి ఒక సైనికుడి ధైర్య కథ తో రెబల్ స్టార్ ప్రభాస్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర యూనిట్ ఫౌజీ అనే పేరు ప్రకటించింది. ఈ టైటిల్ తో గత కొంతకాలంగా షూటింగ్ కూడా జరిగింది. నేడు ఖరారు చేస్తూ ప్రకటన వెలువరించారు. నిన్న విడుదలచేసిన A Battalion Who Walks Alone”, “Most Wanted Since 1932” పోస్టర్‌పై ఉన్న ఈ వాక్యాలు ప్రభాస్ పవర్ ఫుల్ పాత్రని సూచిస్తున్నాయి. బ్రిటిష్ పాలనా కాలాన్ని గుర్తు చేస్తుంది. పోస్టర్‌లో ఉన్న భగవద్గీత శ్లోకాలు ఈ కథకు ఫిలాషఫికల్ డెప్త్ ని యాడ్ చేస్తున్నాయి.
అజాద్ హిందూ ఫౌజ్ స్థాపకుడు పటేల్ నేపథ్యంగా కథ వుంటుందని తెలుస్తోంది. దానికి అత్యంత అద్భుతంగా తెరకెక్కించే పనిలో దర్శకుడు వున్నాడు. ఇది పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ సరసన హీరోయిన్‌గా ఇమాన్వీ నటిస్తోంది. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భాను చందర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ప్రఖ్యాత నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. టి సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్రాన్ని నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ లు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని సుదీప్ చటర్జీ (ISC) నిర్వహిస్తుండగా, సంగీతాన్ని విషాల్ చంద్రశేఖర్ అందిస్తున్నారు. అనిల్ విలాస్ జాధవ్ ప్రొడక్షన్ డిజైనర్, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్.
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: హను రాఘవపూడి
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
సహ నిర్మాత (T-సిరీస్) : శివ చనన
ప్రెసిడెంట్ (టి-సిరీస్) : నీరజ్ కళ్యాణ్
DOP: సుదీప్ ఛటర్జీ ISC
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
ప్రొడక్షన్ డిజైనర్: అనిల్ విలాస్ జాదవ్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
సాహిత్యం: కృష్ణకాంత్
కొరియోగ్రాఫర్: ప్రేమ్ రక్షిత్
కాస్ట్యూమ్ డిజైనర్లు: శీతల్ ఇక్బాల్ శర్మ, టి విజయ్ భాస్కర్
VFX: RC కమల కన్నన్
పబ్లిసిటీ డిజైనర్లు: అనిల్-భాను
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో