Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Prabhas : ప్రభాస్ పుట్టినరోజున చిత్రం గా పద్మవ్యూహాన్ని జయించిన పార్ధుడు పోస్టర్ రిలీజ్

Advertiesment
Prabhas' film Ga Parthudu poster

చిత్రాసేన్

, మంగళవారం, 21 అక్టోబరు 2025 (12:42 IST)
Prabhas' film Ga Parthudu poster
కల్కి 2898 AD  తర్వాత రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో బిగ్గెస్ట్ పాన్ ఇండియా వెంచర్‌లో నటిస్తున్నారు. ప్రఖ్యాత పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. టి సిరీస్‌ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పిస్తున్నారు.
 
దీపావళి శుభ సందర్భంగా ఈ చిత్రం కాన్సెప్ట్ పోస్టర్ విడుదలైంది. మ్యాసీవ్ రైఫిల్స్ ఒక క్లస్టర్‌లో అమర్చబడి, కొన్ని యాంగిల్స్  నిటారుగా, కాల్పులు జరుపుతూ, యుద్ధ వాతావరణాన్ని చూపించాయి.  ఒంటరి బెటాలియన్ లాగా నిలబడి ఉన్న ప్రభాస్ సిల్హౌట్ అదిరిపోయింది.
 
అతను పద్మవ్యూహాన్ని జయించిన పార్ధుడు అని పోస్టర్ పై రాసి వుండటం మహాభారతంలోని అర్జునుడిని పొయెటిక్ గా ప్రజెంట్ చేస్తోంది.  
 
ఈ హై-స్టేక్స్ వార్ డ్రామాలో ప్రభాస్‌తో పాటు  అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భాను చందర్ లాంటి వెటరన్ యాక్టర్స్ పవర్ ఫుల్ పాత్రల్లో నటిస్తున్నారు. ప్రభాస్ సరసన ఇమాన్వి మహిళా కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం ప్రభాస్, హను రాఘవపూడి, మైత్రి మూవీ మేకర్స్  ఫస్ట్ కొలాబరేషన్. ఈ త్రయం పరిశ్రమ అంతటా మ్యసీవ్ బజ్‌ను సృష్టిస్తుంది.
 
ఆసక్తిని మరింత పెంచుతూ చిత్రబృందం Decryption Begins on October 22nd అనే లైన్‌తో ఓ పెద్ద అప్‌డేట్ రాబోతోందని ఎక్సయిట్ చేసింది. అంటే, అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు కంటే ఒక రోజు ముందే ఒక సిగ్నిఫికెంట్ రివీల్ ఉండబోతోంది.
 
ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీమ్ పనిచేస్తోంది. సినిమాటోగ్రఫీని సుదీప్ చటర్జీ (ISC) నిర్వహిస్తుండగా, సంగీతాన్ని విషాల్ చంద్రశేఖర్ అందిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైన్  అనిల్ విలాస్ జాధవ్ చేపట్టగా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్. నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ ఈ ప్రాజెక్ట్‌ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.  
 
అద్భుతమైన విజన్‌, అత్యుత్తమ టెక్నికల్ టీం, ప్రముఖ నిర్మాణ సంస్థల మద్దతు, ఇంతకుముందు ఎప్పుడూ చూడని అవతార్‌లో నటిస్తున్న స్టార్ హీరో ప్రభాస్,, ఇవన్నీ కలగలిపి  #PrabhasHanu సినిమా థియేటర్లలో బిగ్గెస్ట్ సినిమాటిక్ ఈవెంట్ గా నిలవబోతోంది.
 
తారాగణం: ప్రభాస్, ఇమాన్వి, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద, భాను చందర్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Shobhita : ప్రేమ, వెలుగు కలిసి ఉండటం అంటే దీపావళే అంటున్న చైతు, శోభిత