బాలీవుడ్ ప్ర‌స్ధానం వ‌చ్చేది ఎప్పుడు..?

మంగళవారం, 27 ఆగస్టు 2019 (20:56 IST)
టాలీవుడ్లో ఊహించని విధంగా ప్రశంసలు అందుకున్న ప్రస్థానం సినిమా ఇప్పుడు బాలీవుడ్లో రీమేక్ అవుతోన్న సంగతి తెలిసిందే. సంజయ్ దత్ ఎంతో ఇష్టంగా నిర్మిస్తూ నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ నుంచి ఆడియెన్స్‌లో స్పెషల్ ఎట్రాక్షన్‌ని క్రియేట్ చేస్తోంది. ఇక సినిమా ట్రైలర్ డేట్‌ను కూడా ఫిక్స్ చేశారు.
 
ఆగస్ట్ 29న సినిమాపై అంచనాలు పెరిగేలా దర్శకుడు దేవ కట్టా ట్రైలర్‌ను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగులో సాయి కుమార్ నటించిన పాత్రలో హిందీ ప్రస్థానంలో సంజయ్ దత్ నటిస్తున్నాడు. మనిషా కొయిరాలా - జాకీష్రాఫ్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 20న గ్రాండ్‌గా విడుదల కానుంది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ''సాహో''లో దొంగగా కనిపించనున్న ప్రభాస్?