గౌరి రోరంకి దర్శకత్వంలో శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీలీల జంటగా నటించిన చిత్రం "పెళ్లి సందడి". ఈ సినిమా 1996లో హీరో శ్రీకాంత్ నటించిన పెళ్లి సందడి సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కింది.
గతేడాది అక్టోబర్‌లో రిలీజైన పెళ్లి సందడి సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లనే రాబట్టింది. కానీ ఈ సినిమాకి బాడ్ రివ్యూలు, విమర్శలు తప్పలేదు.
ఈ సినిమాకి దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గారు దర్శకత్వ పర్యవేక్షణ చేయగా, మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలుగా వ్యవహరించారు.
తాజాగా పెళ్లి సందడి సినిమా డిజిటల్ లో సందడి చెయ్యడానికి రెడీ అయ్యింది. ప్రముఖ జీ 5 ఓటిటిలో ఈనెల 24వ తేదీ నుండి పెళ్లి 'సందడి' మొదలుకానుంది.
బాక్సాఫీస్ వద్ద హిట్టైన సినిమాలు, ఫ్లాపైన సినిమాలు వారాల గ్యాప్‌లోనే డిజిటల్ స్టీమింగ్‌కు రెడీ అవుతుండగా, పెళ్ళిసందడి సినిమా మాత్రం ఎనిమిది నెలల లాంగ్ గ్యాప్‌కు తర్వాత విడుదల కానుంది.