Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డిజిటల్ రంగంలో ఆర్‌.ఆర్‌.ఆర్‌. రికార్డ్ సృష్టిస్తుంది- జీ5

Junior NTR, Ram Charan
, సోమవారం, 30 మే 2022 (18:52 IST)
Junior NTR, Ram Charan
ZEE5 ఇప్పుడు సరికొత్తగా మే  20 నుండి విడుదలైన RRR ('రౌద్రం రణమ్ రుధిరం')ని బహుళ భాషలలో ప్రసారం చేస్తోంది. ఈ సినిమాలో ఉన్న థ్రిల్లింగ్ విజువల్స్ తో వీక్షకులను ఆకట్టుకుంటున్న 'RRR' భారతదేశంలోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్ గా నిలబడింది.ఇలాంటి మంచి సినిమాలు ZEE5లో ప్రసారం చేయడంతో ఇప్పుడున్న ఓటిటి లలోకే అతిపెద్ద డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ గా ZEE5 నిలుస్తుంది.
 
SS రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ నటించిన 'RRR' మే 20 న తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళంలో ప్రసారం చేయడం ప్రారంభించినప్పటి నుండి ZEE5లో 1,000 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలతో దూసుకుపోతూ డిజిటల్ రంగంలో రికార్డ్ సృష్టిస్తుంది.విడుదలైన నాలుగు భాషల్లో 'RRR' ట్రెండింగ్‌లో అగ్రస్థానంలో ఉంది.
 
ZEE5లో 'RRR' యొక్క అత్యుత్తమ ప్రదర్శనపై తారక్ స్పందిస్తూ, "ZEE5లో RRR పట్ల మీరందరూ చూపిస్తున్న ప్రేమను చూసినప్పుడు నాకు కృతజ్ఞత కలుగుతుంది. తెలుగులో మన ప్రేక్షకుల ముందుకు రావడం చాలా సంతోషంగా ఉత్సాహంగా ఉంది. , తమిళం, కన్నడ మరియు మలయాళం. మీ అద్భుతమైన స్పందన చూసి మేము చాలా సంతోషిస్తున్నాము.
 
"ZEE5లో  తమా సినిమాపై అత్యంత  ప్రేమను చూపిస్తున్న వీక్షకులపై రామ్ చరణ్ ఆనందంలో మునిగిపోయాడు. "ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళంలో విడుదల అయినందుకు,మీ అందరిలాగే మేము కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాము.మా చిత్రాన్ని 1,000 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలతో దూసుకుపోతూ రికార్డ్ సృస్టించేలా మా సినిమాను మెచ్చినందుకు ZEE5 వీక్షకులకు ధన్యవాదాలు" అని ఆయన అన్నారు.
 
'RRR' బాక్సాఫీస్ వద్ద నమ్మశక్యం కాని స్ట్రీమింగ్ నిమిషాలు క్రాస్ చేస్తూ డిజిటల్ రంగంలో' దూసుకుపోతుండడంతో ఇప్పుడు ZEE5 OTTలో బిజీగా ఉంది!

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్ర శేఖర్ యేలేటి, గుణ్ణం గంగరాజువిడుదల చేసిన ఓ కల ఫస్ట్ సాంగ్