దక్షిణాది సూపర్ స్టార్ నయనతార, దర్శఖుడు విఘ్నేశ్ శివన్ పెళ్లి వేడుక చెన్నైలోని మహాబలిపురంలో జరుగనుంది. అయితే ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన హక్కుల్ని నయనతార అమ్మేసుకుందని వార్తలు వస్తున్నాయి. తాజాగా పెళ్లి వేడుకలు హక్కులను కూడా ప్రముఖ ఓటిటి దిగ్గజ సంస్థకు అమ్మి వేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
తమిళనాడులో నయనతార కు ఊహించని విధంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న దీంతో ఆమె పెళ్లి కోసం అభిమానులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నయనతార వివాహం ఓటిటిలో స్ట్రీమింగ్ అవ్వడానికి కొన్ని కోట్ల రూపాయలు వీరికి చెల్లించినట్లుగా తెలుస్తోంది.
ఇక వీరి వివాహం మొత్తం కూడా ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ చక్రవర్తి షూటింగ్ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీరి వివాహ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ అత్యధిక ధరకు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఒక్క ఫోటో కూడా బయటకు లీక్ కాకుండా చూసుకోవాలని ఫిక్స్ అయినట్లుగా ఆసంస్థ తెలుస్తోంది.
పెళ్లి వేడుకలను ఇలా చేయాలని నిర్ణయం తీసుకోవడంతో డబ్బు కోసమే ఇదంతా ఇలా చేస్తున్నారని అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.