Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Rashmika Mandanna 'పుష్ప' దెబ్బకు అదిరిపోతుంది, ఉదయాన్నే 4 గంటలకు లేస్తే పడుకునేది రాత్రి 10 గంటలకే (Video)

Advertiesment
Rashmika Mandanna 'పుష్ప' దెబ్బకు అదిరిపోతుంది, ఉదయాన్నే 4 గంటలకు లేస్తే పడుకునేది రాత్రి 10 గంటలకే (Video)
, బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (14:12 IST)
అబ్బో.. ఓవర్ వర్క్ అని చాలామంది ఉద్యోగులు అనుకుంటుంటారు. ఉదయం మొదలెడితే రాత్రి 12 అయిపోతుందండీ, పడుకునేందుకు కనీసం 6 గంటలు కూడా మిగలడంలేదు అని వాపోతూ వుంటారు. కంపెనీలు పండేస్తున్నాయండీ అని కూడా చెప్పేస్తుంటారు.

ఐతే కొన్ని పరిశ్రమల్లో వ్యక్తుల జీవితం హ్యాపీగా వుంటుందని అనకుంటూ వుంటారు. ఇలాంటి పరిశ్రమల్లో సినీ పరిశ్రమ కూడా ఒకటి. ఇండస్ట్రీలో వుండే నటీనటులు కోట్లలో పారితోషికాలు తీసుకోవడమే కాదు వారి జీవితం కష్టం లేకుండా సాగిపోతుందని అనుకుంటారు కానీ అది నిజం కాదని వారి పని షెడ్యూళ్లు చూస్తే అర్థమవుతుంది.
 
అసలు విషయానికి వస్తే... అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటిస్తున్న పుష్ప చిత్రం కేరళ అడవుల్లో జరుగుతోంది. ఇక్కడ అవుట్ డోర్ లొకేషన్లలో షూటింగ్ చేస్తున్నారు. ఈ అనుభవాలను హీరోయిన్ రష్మిక మందన పంచుకుంది.
 
తను బస చేసే హోటల్ నుంచి షూటింగ్ స్పాట్ చాలా దూరంగా వుందట. అక్కడికి వెళ్లేందుకు వేకువ జామున 4 గంటలకే నిద్ర లేస్తుందట. ఆ తర్వాత షూటింగ్ ముగించుకుని మళ్లీ తిరిగి వచ్చేసరికి రాత్రి 10 గంటలవుతోందట. దీనికితోడు ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా తనకు వేసే మేకప్ కోసం మరో 2 గంటల సమయం పడుతోందట.
 
 అలా మొత్తమ్మీద తను నిద్రపోయేందుకు కేవలం 4 గంటల మాత్రమే మిగిలుతోందట. ఐతే దీన్ని ఛాలెంజ్‌గా తీసుకుని నటిస్తున్నట్లు చెపుతోంది రష్మిక. పైగా ఇంత కష్టపడి చేస్తున్నాం కాబట్టి అవుట్ పుట్ అదిరిపోయేలా వుంటుందని అంటోంది రష్మిక.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తన కంటే మరో గొప్ప నటి మరొకరు లేరు : కంగనా రనౌత్