Bahubali Epic recored poster
బాహుబలి సినిమాతో ఒక్కసారిగా ప్రపంచ స్థాయిలో అందరి ద్రుష్టి ఆకర్షించిన దర్శకుడు రాజమౌళి ఆ సినిమా విడుదలయ్యాక రకరకాల ప్రకటనలు వ్యాపారాలతో నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టాడు. పనిలో పనిగా ఆయనకూ ఎంతోకొంత ఫలితం దక్కుతుంది. తెలుగు సినిమా రంగంలో ఆయనకున్న ముందు చూపు హరెవరికీ లేదేమోనని చెప్పవచ్చు. తాజాగా మరోసారి బాహుబలి సినిమాను రీ రిలీజ్ చేయిస్తున్నారు.
2015 జులై 10న బాహుబలి విడుదలయితే, 28, ఏప్రిల్.. 2017లో బాహుబలి 2 విడుదలైంది. ఇక 2025.. అక్టోబర్ 31.. రెండు భాగాలు కలిపి 3డి, 4డి, ఫార్మెట్ విడుదలచేస్తూ ప్రేక్షకులకు థ్రిల్ కలుగజేయనున్నారు.
కాగా, ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు. కనుక ఇదే నెలలో విడుదలచేయాలనేది ఆయన ప్లాన్. పురాణ కల్పిత ఫ్రాంచైజీలోని రెండు భాగాలు ఒక ఎపిక్ సినిమాటిక్ అనుభవంగా కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అక్టోబర్ 31 నుండి ప్రపంచవ్యాప్తంగా సినిమాహాళ్లలో రాబోతున్న ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ మామూలుగా లేవు.
బాహుబలి-ది ఎపిక్ యుఎస్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూసుకుపోతోంది; ఇప్పటికే $60,000 దాటిందనేది సమాచారం. అంటే100 షోలలో దాదాపు 3,000 టిక్కెట్లు అమ్ముడయ్యాయి.ఇది అక్టోబర్ 29న యుఎస్‌లో ప్రీమియర్ అవుతుంది. BookMyShow లో 200K+ ఆసక్తులను దాటింది. ఈ చిత్రం పలు భాషలలో విడుదల కానుంది.