Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కథ, కథనాల మీదే నడిచే సినిమా రా రాజా చూసి సక్సెస్ చేయాలి: దర్శకుడు బి. శివ ప్రసాద్

Advertiesment
B. Siva Prasad, Shekhar Chandra, Rahul Sri Vatsav, Burle Hari Prasad

దేవి

, మంగళవారం, 4 మార్చి 2025 (17:24 IST)
B. Siva Prasad, Shekhar Chandra, Rahul Sri Vatsav, Burle Hari Prasad
మొహాలు చూపించకుండా సినిమాను తీయడం అనేది మామూలు సాహసం కాదు. ఆర్టిస్టుల్ని చూపించకుండా కేవలం కథ, కథనాల మీదే నడిచే సినిమా ఇది. శ్రీమతి పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్ మీద బి.శివ ప్రసాద్ తెరకెక్కించిన చిత్రం ‘రా రాజా’. ఇలాంటి అద్భుతమైన ప్రయోగం చేసి మెప్పించేందుకు రెడీ అయింది ‘రా రాజా’ టీం. ఈ చిత్రానికి బూర్లే హరి ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, కిట్టు లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 7న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చింది.
 
దర్శకుడు బి. శివ ప్రసాద్ మాట్లాడుతూ* .. ‘నిర్మాతగా సినిమాలు చేస్తున్న టైంలో నా మైండ్‌లోకి వచ్చిన పాయింట్‌ను కథగా మార్చాను. అలా అనుకోకుండానే నేను దర్శకుడిగా మారిపోయాను. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఇప్పటి వరకు చూసిన వారంతా మెచ్చుకున్నారు. అందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
 
మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర మాట్లాడుతూ* .. ‘రా రాజా చిత్రానికి మంచి మ్యూజిక్ ఇచ్చే స్కోప్ దక్కింది. శివ ప్రసాద్ నాకు నిర్మాతగా ఎప్పటి నుంచో తెలుసు. రా రాజా కథ గురించి ఆయన చెప్పారు. కానీ అప్పుడు నిర్మాతగా చెబుతున్నారని అనుకున్నా.. కానీ దర్శకుడిగా కథ చెబుతున్నారని తరువాత అర్థమైంది. కథ చాలా బాగుంది. సినిమా బాగా వచ్చింది. మీడియా, ఆడియెన్స్ అందరూ సినిమాకు సపోర్ట్ అందించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు
 
కెమెరామెన్ రాహుల్ శ్రీ వాత్సవ్ మాట్లాడుతూ* .. ‘రా రాజా సినిమాకు పని చేయడం ఆనందంగా ఉంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ఈ చిత్రం చాలా బాగా వచ్చింది. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను చెప్పింది కాకపోతే ఇకపై జడ్జిమెంట్ ఇవ్వను : రాజేంద్రప్రసాద్