Tammareddy Bharadwaj released the Raa Raja date poste
ఆర్టిస్టుల్ని చూపించకుండా కేవలం కథ, కథనాల మీదే నడిచే సినిమా రా రాజా.. అసలు మొహాలు చూపించకుండా సినిమాను తీయడం అనేది మామూలు సాహసం కాదు. ఇలాంటి అద్భుతమైన ప్రయోగం చేసి మెప్పించేందుకు రెడీ అయింది రా రాజా టీం. ఈ చిత్రానికి బూర్లే హరి ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, కిట్టు లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. శ్రీమతి పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్ మీద బి.శివ ప్రసాద్ తెరకెక్కించిన చిత్రం.
తాజాగా రిలీజ్ చేసిన ఈ ట్రైలర్‌ను తమ్మారెడ్డి భరద్వాజ్ వీక్షించి అభినందించారు. అనంతరం రిలీజ్ డేట్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.
తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ..* రా రాజా మూవీ టైటిల్‌ను గమనిస్తే ఏదో ప్రేమ కథలా అనిపిస్తుంది. కానీ ఈ చిత్రంలో ఓ మొహం కూడా కనిపించదు. అసలు మొహాలు చూపించకుండా సినిమా తీసి దర్శకుడు శివ ప్రసాద్ ధైర్యం చేశాడు. డ్యూయెల్ అని ఇది కనుక సక్సెస్ అయితే ఇండస్ట్రీ మొత్తం మారిపోతుంది. అసలు హీరోలు, స్టార్లతో పని లేకుండా అద్భుతమైన చిత్రాలు, ప్రయోగాలు చేయొచ్చని అంతా ముందుకు వస్తారు. హీరో హీరోయిన్ల కోసం సినిమాలకు వస్తుంటారు. కానీ ఇందులో మొహాలు కూడా కనిపించవు. కథే ముందుకు వెళ్తుంటుంది. ఇది అద్భుతమైన ఐడియా. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. శేఖర్ చంద్ర మ్యూజిక్ బాగుంది. మార్చి 7న ఈ చిత్రం రాబోతోంది. ఈ మూవీని అందరూ చూసి సపోర్ట్ చేయండని అన్నారు.
దర్శకుడు శివ ప్రసాద్ మాట్లాడుతూ..* మా ట్రైలర్‌ను చూసి, రిలీజ్ డేట్ పోస్టర్‌ను రిలీజ్ చేసి, అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి థాంక్స్. మా చిత్రంలో ఆర్టిసుల మొహాలు కనిపించవు. కథ, కథనమే ముఖ్యం అని మేం ఈ మూవీని తీశాం. ఇది ఒక ప్రయోగం. మా ప్రయోగాన్ని అందరూ ఆదరిస్తారని, అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను అని అన్నారు.