Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రా రాజా లాంటి కాన్సెప్ట్‌తో సినిమా తీయడం చాలా గొప్ప విషయం : జేడీ చక్రవర్తి

Advertiesment
JD Chakraborty, Burle Hari Prasad

దేవి

, మంగళవారం, 25 ఫిబ్రవరి 2025 (17:14 IST)
JD Chakraborty, Burle Hari Prasad
ఆర్టిస్టుల్ని చూపించకుండా కేవలం కథ, కథనాల మీదే నడిచే సినిమా రా రాజా. అసలు మొహాలు చూపించకుండా సినిమాను తీయడం అనేది మామూలు సాహసం కాదు. ఇలాంటి అద్భుతమైన ప్రయోగం చేసి మెప్పించేందుకు రెడీ అయింది ‘రా రాజా’ టీం. ఈ చిత్రానికి బూర్లే హరి ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, కిట్టు లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 7న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. శ్రీమతి పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్ మీద బి.శివ ప్రసాద్ తెరకెక్కించిన చిత్రం ‘రా రాజా’. 
 
*ఈ క్రమంలో రా రాజా చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసిన విలక్షణ నటుడు జేడీ చక్రవర్తి మాట్లాడుతూ..* ‘రా రాజా చిత్రానికి సంబంధించిన టైటిల్, పోస్టర్ చూస్తుంటేనే ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉంది. మాములూగా అమ్మాయి హగ్ చేసుకుని, ముద్దు పెడితే హ్యాపీగా ఉంటుంది. కానీ ఈ పోస్టర్‌లో అమ్మాయి అలా హగ్ చేసుకుంటున్నా కూడా భయమేస్తోంది. పోస్టర్‌లో ఉన్న కలరింగ్, ఫాంట్, ట్యాగ్ లైన్ ఇవన్నీ చూస్తుంటే ఇందులో చాలా చాలా ట్విస్టులు ఉన్నాయని అర్థం అవుతోంది. ఇదొక సూపర్ నేచురల్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. అసలు హీరో హీరోయిన్ల మొహాల్ని కూడా చూపించడం లేదు. ఒక్క మొహాన్ని కూడా చూపించకుండా భయపెట్టడం మామూలు విషయం కాదు. ప్రపంచంలో ఏ హారర్ దర్శకుడు కూడా మొహం చూపించకుండా సినిమా తీయలేదు. ఇలాంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సినిమా చేయడం గ్రేట్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. దర్శక, నిర్మాతలకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
 
‘రా రాజా’ సినిమాను మార్చి 7న భారీ ఎత్తున విడుదల చేయబోతోన్నారు. ఈ చిత్రానికి  రాహుల్ శ్రీ వాత్సవ్ కెమెరామెన్‌గా, శేఖర్ చంద్ర సంగీత దర్శకుడిగా పని చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

L2 ఎంపురాన్ నుంచి గేమ్ ఆఫ్ థ్రోన్స్ నటుడు జెరోమ్ ఫ్లిన్