Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నారా రోహిత్ నటించిన ప్రతినిధి 2 థియేట్రికల్ రిలీజ్

Pratinidi 2 relese poster

డీవీ

, బుధవారం, 10 ఏప్రియల్ 2024 (17:33 IST)
Pratinidi 2 relese poster
హీరో నారా రోహిత్ 'ప్రతినిధి 2'చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహించిన ఈ చిత్రం, వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్ బ్యానర్‌లపై కుమార్ రజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్‌ కు అద్భుతమైన స్పందన వచ్చింది. నారా రోహిత్ తన ఇంటెన్స్ నటనతో మనల్ని ఆశ్చర్యపరిచాడరు. మూర్తి రచన, దర్శకత్వంకు మంచి ప్రశంసలు వచ్చాయి.
 
టీజర్‌కి వచ్చిన రెస్పాన్స్‌తో ఆనందం వ్యక్తం చేసిన మేకర్స్, ఉగాది శుభ సందర్భంగా సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేశారు. ప్రతినిధి 2 ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రతినిధి 10 సంవత్సరాల క్రితం 2014లో ఇదే తేదీన విడుదల కావడం విశేషం.
 
విడుదల తేదీ పోస్టర్‌లో రోహిత్  సిల్హౌట్ ఇమేజ్ చూడవచ్చు, ఇక్కడ ప్రజల ఒక వైపు చేతులు ఎత్తడం, మరొక వైపు అల్లర్లు పరిస్థితిని కూడా చూడవచ్చు. బ్యాక్ గ్రౌండ్ లో దినపత్రికలు, కథనాల  విభిన్న ముఖ్యాంశాలను వున్నాయి. రిలీజ్ డేట్ మరెంతో దూరంలో లేకపోవడంతో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది.
 
'ప్రతినిధి 2' అనేది ప్రతినిధి సిరీస్ నుండి రెండవ ఫ్రాంచైజీ. ఈ సినిమాలో నారా రోహిత్ నిజాయితీ గల న్యూస్ రిపోర్టర్ పాత్రలో కనిపించనున్నారు. సిరీ లెల్లా కథానాయికగా నటిస్తుండగా, దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
 
నాని చమిడిశెట్టి డీవోపీగా చేస్తుండగా, యంగ్ సెన్సేషన్ మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. రవితేజ గిరిజాల ఎడిటర్, కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఇండస్ట్రీకి అండగా ఉంది : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క