Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రతినిధి 2 చిత్రంతో నారా రోహిత్ కమ్ బ్యాక్

pratinidi 2 opening shot
, సోమవారం, 28 ఆగస్టు 2023 (16:23 IST)
pratinidi 2 opening shot
హీరో నారా రోహిత్ పొలిటికల్ థ్రిల్లర్ 'ప్రతినిధి 2' తో గ్రాండ్ గా కమ్ బ్యాక్ ఇస్తున్నారు. వానర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సక్సెస్ ఫుల్ పొలిటికల్ థ్రిల్లర్ 'ప్రతినిధి' సిరీస్ నుండి రెండవ ఫ్రాంచైజీగా వస్తున్న ఈ చిత్రానికి “One man will stand again, against all odds” అనేది క్యాప్షన్.
 
ఈ రోజు ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమైయింది. హీరో నారా రోహిత్ పై కీలకమైన సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. ప్రతినిధి 2 కోసం బిగ్ స్పాన్ వున్న కథను ఎంచుకున్నారు నారా రోహిత్. ఈ సినిమా ఫస్ట్ లుక్ సినిమాపై చాలా  క్యూరియాసిటీ పెంచింది.
 
కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, కొండకళ్ల రాజేందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. యువ సంచలనం మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తుండగా, నాని చమిడిశెట్టి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. రవితేజ గిరిజాల ఎడిటర్, కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్.
 
ఈ చిత్రం 2024 జనవరి 25న రిపబ్లిక్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నవీన్ పోలిశెట్టి వెర్సెస్ కె.ఎ.పాల్ - వైజాగ్ లో అభిమానుల సందడి