తెలుగు చిత్ర పరిశ్రమను మెగా ఫ్యామిలీ ఏలేస్తోంది. ఇప్పటికే ఆ కుటుంబానికి చెందిన అనేక మంది హీరోలు ఉన్నారు. మర్రిచెట్టులాంటి మెగాస్టార్ వారందరికీ పునాదులు వేస్తున్నారు. ఇలా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్‌లు ఉన్నారు. వీరితో పాటు.. అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్, మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్‌లు ఉన్నారు.
ఈ కోవలో తాజాగా మరో హీరో వెండితెర అరంగేట్రం చేయనున్నారు. ఆయన ఎవరో కాదు.. మెగా బ్రదర్ నాగేంద్ర ముద్దుల తనయ నిహారికకు కాబోయే భర్త జొన్నలగడ్డ చైతన్య. ఈ మెగా అల్లుడుని కూడా సినీ అరంగేట్రం చేసేందుకు మెగా ఫ్యామిలీ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. అయితే, దీనిపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ఇప్పటివరకు ఉన్న వాళ్లు చాలరేమో అన్నట్లు మరో హీరో వస్తున్నాడంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
హైదరాబాద్‌లోని ఓ ఎమ్ఎన్సీ కంపెనీలో సీనియర్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న ఈయన డిసెంబర్ 9న రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో పెళ్లి జరుగనుంది. కోవిడ్ కారణంగా అతి తక్కువ మంది ప్రముఖులతో ఈ పెళ్లి జరగనుంది.
ఇదిలావుంటే ఈయన చూడ్డానికి అచ్చం హీరోలాగే ఉన్నాడు. కోర మీసాలతో మెగా అల్లుడు లుక్ అదిరిపోతుంది. ఈయన ఫోటోలు బాగానే వైరల్ అవుతున్నాయి కూడా. ఈయన కూడా త్వరలోనే వెండితెరపైకి వస్తున్నాడని.. ఇప్పటికే మెగా అల్లుడి లాంఛింగ్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తుంది.
ఏదేమైనా కూడా ఇప్పటికే చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా వచ్చాడు. ఇప్పుడు మెగా కుటుంబం నుంచి మరో అల్లుడు వస్తున్నాడన్నమాట. మరి ఈయన జాతకం ఎలా ఉండబోతుందో చూడాలి.