Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిగ్ బాస్ సీజన్ 7.. ఫుల్ మజా.. థీమ్ మ్యూజిక్ వీడియో రిలీజ్ (video)

Advertiesment
Bigg Boss 7 Season
, మంగళవారం, 11 జులై 2023 (10:43 IST)
Bigg Boss 7 Season
రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 త్వరలో ప్రారంభం కానుంది. కొత్త సీజన్‌కు సంబంధించి స్టార్ మా నుండి అధికారిక ప్రకటన వెలువడింది. బిగ్ బాస్ సీజన్-7 త్వరలో ప్రారంభం కానుంది. బిగ్‌బాస్ సీజన్-7 ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉండబోతోందని ప్రకటించారు. 
 
స్టార్ మా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన బిగ్ బాస్ థీమ్ మ్యూజిక్‌తో కూడిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కంటెస్టెంట్లు గేమ్‌లు ఆడటం, వ్యూహాలు, డ్రామాలు సరిగా సాగకపోవడం, హౌస్‌లో ప్రేమకథలు సరిగా వర్కవుట్ కాకపోవడం వంటి కారణాలతో బిగ్ బాస్-6 తెలుగు చాలా తక్కువ రేటింగ్‌లను పొందింది. 
 
ఈసారి అలాంటి తప్పులు పునరావృతం కాకుండా బిగ్ బాస్ నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రేక్షకులకు తెలిసిన వారినే హౌస్‌లోకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
మరోవైపు బిగ్ బాస్ సీజన్-7 హోస్ట్ మారనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈసారి నాగార్జున ఈ షోకి హోస్ట్‌గా వెళ్లడం లేదు. స్టార్ హీరోని హోస్ట్‌గా తీసుకురావాలని స్టార్ మా ప్లాన్ చేస్తోంది. మూడో సీజన్ నుంచి నాగార్జున ఈ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హీరోగా అరంగేట్రం చేయనున్న వైఎస్ షర్మిల కుమారుడు.. డైరక్టర్ ఎవరో తెలుసా?