Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చైతు ఫ‌స్ట్ లుక్ వైర‌ల్... కానీ..?

అక్కినేని నాగ‌చైత‌న్య ప్ర‌స్తుతం స‌వ్య‌సాచి, శైల‌జారెడ్డి అల్లుడు చిత్రాల్లో న‌టిస్తున్నాడు. ప్రేమ‌మ్ ఫేమ్ చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న స‌వ్య‌సాచి, మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న శైల‌జారెడ్డి అల్లుడు సినిమాలు రిలీజ్‌కి రెడీ అవుతున్నాయ

Advertiesment
చైతు ఫ‌స్ట్ లుక్ వైర‌ల్... కానీ..?
, సోమవారం, 2 జులై 2018 (20:42 IST)
అక్కినేని నాగ‌చైత‌న్య ప్ర‌స్తుతం స‌వ్య‌సాచి, శైల‌జారెడ్డి అల్లుడు చిత్రాల్లో న‌టిస్తున్నాడు. ప్రేమ‌మ్ ఫేమ్ చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న స‌వ్య‌సాచి, మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న శైల‌జారెడ్డి అల్లుడు సినిమాలు రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. వీటిలో ఏ సినిమా ముందుగా వ‌స్తుందో చెప్ప‌లేని ప‌రిస్థితి. ఇదిలాఉంటే... శైల‌జారెడ్డి అల్లుడు ఫ‌స్ట్ లుక్ అంటూ చైత‌న్య లుక్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ స్టిల్ ఇలా బ‌య‌ట‌కు వ‌చ్చిందో లేదో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. 
 
అయితే... ఈ స్టిల్ చూసిన శైల‌జారెడ్డి అల్లుడు నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ ట్విట్ట‌ర్లో స్పందిస్తూ... ఈ స్టిల్‌కి శైల‌జారెడ్డి అల్లుడు ఫ‌స్ట్ లుక్‌కి ఎలాంటి సంబంధం లేదు. శైల‌జారెడ్డి అల్లుడు ఫ‌స్ట్ లుక్‌ని త్వ‌ర‌లోనే అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేస్తామ‌ని చెప్పారు. ఏదిఏమైనా ఫ‌స్ట్‌లుక్ అంటూ బ‌య‌ట‌కు వ‌చ్చిన ఈ స్టిల్ కూడా అదిరింది. ఈ నెల 25కి శైల‌జా రెడ్డి అల్లుడు షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. ఆగ‌స్టు నెలాఖ‌రున ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాకేమో తల్లి పాత్రలు.. వారికేమో పడుచు పిల్లలా? నిలదీస్తున్న హీరోయిన్