Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మాకేమో తల్లి పాత్రలు.. వారికేమో పడుచు పిల్లలా? నిలదీస్తున్న హీరోయిన్

బాలీవుడ్ ఇండస్ట్రీనేకాకుండా, దక్షిణాది సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన అలనాటి హీరోయిన్లలో మనీషా కోయిరాలా ఒకరు. వెండితెరపై తన అందచందాలతో మెప్పించిన మనీషా.. ఇటీవలే తన రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది.

మాకేమో తల్లి పాత్రలు.. వారికేమో పడుచు పిల్లలా? నిలదీస్తున్న హీరోయిన్
, సోమవారం, 2 జులై 2018 (18:14 IST)
బాలీవుడ్ ఇండస్ట్రీనేకాకుండా, దక్షిణాది సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన అలనాటి హీరోయిన్లలో మనీషా కోయిరాలా ఒకరు. వెండితెరపై తన అందచందాలతో మెప్పించిన మనీషా.. ఇటీవలే తన రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. అయితే, ఈమెకు ఎక్కువగా తల్లి పాత్రలే వస్తున్నాయి. దీంతో ఒకింత అసహనాన్ని, అసంతృప్తిని వ్యక్తంచేసింది.
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, తమతో కలిసి నటించిన చాలా మంది హీరోలు ఇప్పటికీ హీరోలుగానే నటిస్తున్నారు. వీరికి సినీ అవకాశాలు నాటి నుంచి నేటివరకు వస్తూనే ఉన్నాయి. నిజాయితీగా మాట్లాడుకుంటే ఆ హీరోలు ఇప్పటికీ 20 ఏళ్ల అమ్మాయిలను హీరోయిన్లుగా పెట్టి సినిమాల్లో నటిస్తున్నారు. 
 
కానీ మేము మాత్రం 40 దాటగానే తల్లిపాత్రలకే పరిమితమైపోతున్నాం. ఇది నేను ఎప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నాను. అంటూ నేపాల్ బ్యూటీ ఆవేదనతో పాటు కొద్దిపాటి ఆగ్రహాన్నికూడా వ్యక్తంచేసింది. 
 
సాధారణంగా వెండితెరపై హీరోయిన్ల లైఫ్ స్పాన్ బాగా తక్కువ. ఎంత గ్లామర్‌ను మెయింటెయిన్ చేసినా.. మహా అయితే ఓ 10 సంవత్సరాలు హీరోయిన్‌గా కొనసాగగలరేమో. అదే హీరోలకైతే ఆ బాధేలేదు. తమ ఓపికను బట్టి, జనాదరణ బట్టి హీరోగా రాణిస్తుంటారు. ఇదే మనీషా కోయిరాలాకు ఏమాత్రం నచ్చడం లేదు.
 
కాగా, ఇటీవల రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మనీషా కోయిరాలాకు 'డియర్ మాయా', 'లస్ట్ స్టోరీస్'లో వైవిధ్యమైన పాత్రలు పోషించింది. తాజాగా వచ్చిన 'సంజు' చిత్రంలో సంజయ్ దత్ తల్లిగా నటించింది. ఇలాంటి పాత్ర వేయడం పట్ల ఆమె తెగ ఫీలైపోతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాల‌య్య మైత్రీ సంస్థ‌కు ఓకే చెప్పేనా..?