Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇప్పుడే తల్లిని చేయవద్దన్న నటి... కానీ ఒప్పేసుకుందట...

అన్నా నా భర్తను చంపేయ్... అన్నా.. ఇలాంటి వారి వల్ల సమాజానికి చెడ్డ పేరన్నా అంటూ బాలక్రిష్ణకు చెల్లెలుగా నటించిన దేవయాని మీకు గుర్తుండే ఉంటుంది. ఆమె గురించి పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. హీరోయిన్‌గా అటు తమిళ, ఇటు తెలుగు భాషల్లో నటించింది ఈమె. ఒకప్పుడు

ఇప్పుడే తల్లిని చేయవద్దన్న నటి... కానీ ఒప్పేసుకుందట...
, శుక్రవారం, 2 మార్చి 2018 (18:00 IST)
అన్నా నా భర్తను చంపేయ్... అన్నా.. ఇలాంటి వారి వల్ల సమాజానికి చెడ్డ పేరన్నా అంటూ బాలక్రిష్ణకు చెల్లెలుగా నటించిన దేవయాని మీకు గుర్తుండే ఉంటుంది. ఆమె గురించి పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. హీరోయిన్‌గా అటు తమిళ, ఇటు తెలుగు భాషల్లో నటించింది ఈమె. ఒకప్పుడు దేవయాని అంటే మంచి పేరు ఉండేది. అగ్ర హీరోయిన్లలో ఒకరుగా కూడా ఉన్నారామె. అయితే కొన్ని రోజుల పాటు సినిమాలకు దూరమవుతూ వచ్చారు. తనకంటూ నచ్చిన క్యారెక్టర్లు లేకపోవడం... కొత్త హీరోయిన్ల అరంగేట్రం ఎక్కువవడంతో ఇక దేవయానికి అవకాశాలు తగ్గిపోయాయి.
 
అయితే గత రెండు నెలలుగా ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. అయితే ఆ పాత్రలు ఏమిటంటే... తల్లిగా చేయమని.. తల్లి క్యారెక్టర్ దేవయానికి బాగా ఉంటుందని ఒక డైరెక్టర్ తమిళనాడులో బాగా ప్రచారం చేస్తున్నారట. దీంతో ఓ తమిళ సినిమాలో తల్లిగానే దేవయానికి అవకాశం వచ్చిందట. హీరోయిన్‌కు తల్లి క్యారెక్టర్ అనగానే దేవయాని నో అన్నారట. ఇప్పుడే నన్ను తల్లిని చేసేస్తున్నారేంటి.. నాకేమీ పెద్ద వయస్సు కాలేదు. అలా నేను కనిపించడం లేదు కూడా. వద్దు దయచేసి.. ఆపండి.. హీరోయిన్ అక్క క్యారెక్టర్ చేస్తానని దర్శకుడిని కోరిందట. 
 
అయితే దర్శకుడు కథ మొత్తాన్ని దేవయానికి వినిపించాడట. కథ.. అందులోని తన పాత్ర బాగా నచ్చడంతో ఇక దేవయానికి ఒప్పేసుకుందట. కానీ ఆ డైరెక్టర్‌కు మాత్రం కొన్ని షరతులు పెట్టిందట. తల్లిగా క్యారెక్టర్ చేస్తాను కానీ.. అందులో వయస్సు పైబడే విధంగా చూపించే చీరలు కట్టమంటే మాత్రం కట్టనని తెగేసి చెప్పిందట. దీంతో డైరెక్టర్ అలాంటిదేమీ ఉండదని హామీ ఇచ్చిన తరువాత సినిమాకు ఓకే చేశారట దేవయాని.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరెన్సీ నోటు గురించి మూడు ముక్కలు