భారతీయ చిత్ర పరిశ్రమలో లెజండ్రీ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన మణిరత్నంకు గుండెపోటుకు గురయ్యారు. ఈ కారణంగా ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
ముఖ్యంగా, ఆయనకు గుండెపోటు రావడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. దీంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు.. అభిమానులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఆయనను చెన్నైలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స పొందుతున్నారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు పలువురు సినీ ప్రముఖులు కోరారు.
కాగా, 2004లో 'యువ' సినిమా షూటింగ్ వేళ, మణిరత్నంకు తొలిసారి గుండెపోటు వచ్చింది. సెట్‌లో ఉన్న వేళ, తన ఛాతిలో నొప్పిగా ఉందని ఆయన చెప్పడంతో ఆసుపత్రికి తరలించారు.
ఆ తర్వాత 2015 సంవత్సరంలో 'ఓకే బంగారం' షూటింగ్ వేళ కాశ్మీర్‌లో, 2018లో మరోసారి ఆయనకు గుండెపోటు వచ్చింది. ప్రస్తుతం ఆయన 'పొన్నియన్ సెల్వన్' అనే హిస్టారికల్ మూవీ చేస్తున్నారన్న సంగతి తెలిసిందే.