Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా జీవితంలో ఓ లేడీ బాస్ వుంద‌న్న‌ మ‌హేష్ బాబు

Advertiesment
నా జీవితంలో ఓ లేడీ బాస్ వుంద‌న్న‌ మ‌హేష్ బాబు
, శనివారం, 22 జనవరి 2022 (12:15 IST)
Namrita Shirodkar
ప్ర‌తి మ‌గాడి విజ‌యం వెనుక మ‌హిళ వుంటుంద‌ని అంటుంటారు. అలా త‌న జీవితంలో లేడీబాస్ ఒక‌రు వున్నారంటూ మ‌హేష్‌బాబు చెబుతుండేవారు. తాజాగా ఓటీటీలో ఫిబ్ర‌వ‌రి 4న రాబోయే ఇంట‌ర్య్వూలో కూడా ఆయ‌న ఈ మాట‌ను ప్ర‌స్తావించారు. ఇక ఈరోజు న‌మ్ర‌త శిరోద్క‌ర్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్‌బాబు త‌న జీవితంలో ఓ లేడీ బాస్ వుందంటూ.. ఆమె త‌న భార్య అంటూ స‌ర‌దాగా మాట్లాడారు. అలాగే `మేజ‌ర్‌` సినిమా టీమ్ కూడా ఆమెకు శుభాకాంక్ష‌లు తెలుపుతూ పోస్ట్ చేసింది. ఆ సినిమా నిర్మాత ఆమెనే.
 
1972 జ‌న‌వ‌రి 22న పుట్టిన న‌మ్ర‌త విద్యాభ్యాసం త‌ర్వాత మోడ‌లింగ్ చేసింది. 93లో మిస్ ఇండియాగా కూడా ఎంపికైంది. బాలీవుడ్‌లో సినిమా చేస్తూనే తెలుగులో 2000వ సంవ‌త్స‌రంలో `వంశీ` సినిమాతో ప్ర‌వేశించింది. అందులో మ‌హేష్‌బాబు హీరో. ఇద్ద‌రూ ఆ సినిమాలో స‌మ‌యంలోనే ప్రేమ‌లో ప‌డ్డారు. నాలుగేల్ళ త‌ర్వాత `అత‌డు` సినిమా టైంలో ముంబైలో వారిద్ద‌రూ పెండ్లి చేసుకున్నారు. వారికి గౌత‌మ్‌, సితార పిల్ల‌లున్నారు. 
 
న‌మ్ర‌త ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో చాలా సింపుల్‌గా వుంటుంది. త‌న‌కు ఆమె భార్య‌నేకాదు వ్య‌క్తిగ‌త స‌ల‌హాదారుకూడా అని మ‌హేష్‌బాబు చెప్పారు. మ‌హేష్ ప‌లు యాడ్స్ చేసినా, సినిమా నిర్మాణ సంస్థ స్థాపించినా అందుకు కార‌ణం న‌మ్ర‌త‌నే. ప‌ర్స‌న‌ల్‌గా మ‌హేష్ విషయాలు అన్నీ చూసుకుంటుంది. ఆహార నియ‌మాలు ఎలా పాటించాలోకూడా చెబుతుంటుంది. నా విష‌యాలే కాక ఇంటి విష‌యాలు, పిల్ల‌ల విష‌యాలు చూసుకుంటూ న‌మ్ర‌త చాలా శ్ర‌మిస్తుంద‌ని మ‌హేష్‌బాబు ట్వీట్ చేశాడు కూడా.
 
ఎక్కువగా కుటుంబంతో గ‌డిపే మ‌హేష్‌బాబు ఈసారి మ‌రోసారి విదేశాల‌కు వెళుతున్నారు. ఇటీవ‌లే త‌న సోద‌రుడు మ‌ర‌ణం త‌ర్వాత కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. న‌మ‌త్ర‌కు సినీ ప్ర‌ముఖుల్లో త‌న‌కు స్నేహితులుగా వున్న‌వారితో పార్టీలు కూడా జ‌రుపుకుంటుంది. ఆమెకు ఓ యూట్యూబ్ ఛాన‌ల్ కూడా వుంది. అందులో ఆమె చూపించిన టిప్స్‌కూ మంచి ఆద‌ర‌ణ వుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎ.ఆర్‌. రెహ‌మాన్ ఫ్యామిలీ ఆల్బ‌మ్ కు ట్రెమెండ‌స్ రెస్సాన్స్‌