Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మ‌హేష్ సినిమా కోసం డ్ర‌మ్ముపై థ‌మ‌న్ క‌స‌ర‌త్తు!

Advertiesment
Mahesh Babu
Thaman drums
సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ తాజాగా త‌న సోష‌ల్ మీడియాలో డ్ర‌మ్మ‌ర్ వాయిస్తూ బాణీల‌కోసం త‌పిస్తున్నాడు. దీనిని సోష‌ల్ మీడియాలో పెట్టేస‌రికి అభిమానులు భ‌య్యా.. సర్కారు వారి పాట.. కోస‌మా అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. మ‌రికొంద‌రు సూప‌ర్ భ‌య్యా.. అదిరిపోవాలి. అఖండలాంటి సౌండ్ వ‌ద్దుకానీ. ఇంకాస్త త‌గ్గించి వాయించాలంటూ పోస్ట్ చేశారు. దీనికి థ‌మ‌న్ ఎటువంటి స‌మాధానం ఇవ్వ‌లేదు. పైగా థ‌మ్ స‌ప్ అంటూ డ్ర‌మ్మ‌ర్ శివ‌మ‌ణితో క‌లిసి ఫోజ్ ఇచ్చాడు. 
 
webdunia
Sivamani-Thaman
అయితే మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న మాస్ ఎంటర్ టైన‌ర్‌ “సర్కారు వారి పాట”. సంక్రాంతికి ఈ సినిమా విడుద‌ల కావాల్సివుంది. కానీ క‌రోనా వ‌ల్ల వాయిదా ప‌డింది. అయితే ఈ డ్ర‌మ్మ్స్‌తో థ‌మ‌న్ చేసే సంగీతం కూడా మ‌హేష్‌బాబుకే అని తెలుస్తోంది. ఇప్ప‌టికే త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌, థ‌మ‌న్‌, మ‌హేష్‌బాబు దుబాయ్‌లో ఓసారి క‌లిసి ఫొటో షేర్ చేశారు. క‌నుక మ‌రో కొత్త ఆల్బ‌మ్ కోసం ఎదురుచూసేలా థ‌మ‌న్ చేస్తున్నాడ‌ని తెలుస్తోంది. 
 
ఇదిలా వుండ‌గా, ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా స‌ర్కారివారి పాట కోస‌మే స‌రికొత్త ప్ర‌యోగం చేస్తున్నాడ‌ని వార్త కూడా వినిపిస్తోంది. దానిని ప్ర‌మోష‌న్‌లో భాగంగా వుండ‌చేలా ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లో దీనిపై క్లారిటీ రానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జనవరి 28న విడుదలవుతున్న కీర్తి సురేష్ గుడ్ లక్ సఖి