Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాన్వీ నిక్కర్లు.. ''వెరీ వెరీ షార్ట్స్ షార్ట్స్''.. కత్రినా కైఫ్ కామెంట్స్

Advertiesment
జాన్వీ నిక్కర్లు.. ''వెరీ వెరీ షార్ట్స్ షార్ట్స్''.. కత్రినా కైఫ్ కామెంట్స్
, మంగళవారం, 4 జూన్ 2019 (18:21 IST)
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ నిర్మించిన దఢక్ చిత్రంలో జాన్వీ కపూర్ బాలీవుడ్‌లోకి అడుపెట్టింది. ఈ చిత్రంలో షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ హీరోగా నటించాడు.


ఇకపోతే, గుంజన్ సక్సెనా బయోపిక్‌లో తాజాగా జాన్వీ నటిస్తోంది. ఈ మల్టీస్టారర్ చిత్రంలో రణ్‌వీర్ సింగ్, అలియా భట్, విక్కీ కౌశల్, కరీనా కపూర్ ఖాన్, అనిల్ కపూర్ తదితరులు నటిస్తున్నారు. 
 
ఈ సినిమా సంగతిని ప్రస్తుతం పక్కనబెడితే.. జాన్వీ కపూర్ షార్ట్స్‌పై బాలీవుడ్ సెక్సీతార కత్రీనా కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నేహా ధూపియా నిర్వహించే ఈ షోలో పాల్గొన్న కత్రినా కైఫ్.. జాన్సీ వేసే నిక్కర్లపై ''వెరీ వెరీ షార్ట్స్ షార్ట్స్'' అంటూ కామెంట్స్ చేసింది. జిమ్ డ్రెస్ మరీ ఓవర్‌గా ఉందని ఎవరిని చూస్తే మీకు అనిపిస్తుందంటూ నేహా ధూపియా అడిగిన ప్రశ్నకు కత్రినా సమాధానం ఇచ్చింది.
 
 మరీ ఓవర్ అని కాదు గానీ, జాన్వి కపూర్ నిక్కర్లు చూస్తుంటే తనకు అప్పుడప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుందని చెప్పింది. జాన్వి కపూర్ కూడా కత్రినా కైఫ్ వెళ్లే జిమ్‌కే వెళ్తుంది. అప్పుడప్పుడు నిక్కర్లలో ఉన్న ఫొటోలు కూడా బయటకు వస్తూ ఉంటాయి. జాన్వీ వేసుకునే నిక్కర్ల ద్వారా జిమ్‌కు బయట నిల్చుని వుండే కెమెరా మెన్‌లు ఆకర్షితులవుతుంటారని కత్రినా చెప్పుకొచ్చింది.
webdunia


అయితే ఈ వ్యాఖ్యలపై జాన్వీ కపూర్ స్పందించకపోయినా.. సోనమ్ కపూర్ మాత్రం స్పందించింది. జాన్వీ  ఏ డ్రెస్‌లోనైనా అందంగా కనిపిస్తుందని.. షార్చ్స్ కాదు.. ఇతర డ్రెస్‌ల్లోనూ ఆకట్టుకుంటుందని ఇన్‌స్టాగ్రామ్‌లో మద్దతు పలికింది. 
webdunia

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశాల్ అలాంటి వాడు కాదు...