Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సైంటిఫిక్ మిస్టరీ నేపథ్యంలో కరాళ

JD Akash, Sumita
, బుధవారం, 1 మార్చి 2023 (16:12 IST)
JD Akash, Sumita
రవి శంకర్, జెడి ఆకాష్, సయెద్ ఇర్ఫాన్, సుమితా బజాజ్, సహర్ అఫ్సహ, వీరు ప్రధాన పాత్రలో హెహ్ ఎమ్ శ్రీనందన్ దర్శకత్వం వహించగా బోదాసు నర్సింహా నిర్మించిన చిత్రం "కరాళ" (Karala). ఈ చిత్రం విడుదలకు సిద్ధం గా ఉంది. ఈ చిత్రం కన్నడంలో 'బీగా' (Beega) పేరుతో విడుదల అవుతుంది. కరాళ చిత్రానికి సంభందించిన థియేట్రికల్ ట్రైలర్ ను హైదరాబాద్ లో విడుదల చేసారు. 
 
అనంతరం తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ "ఒక మంచి సినిమా ని ఎంకరేజ్ చేసే ఆ సినిమా బ్రతుకుతుంది. ఈ చిత్రం శ్రీ లక్ష్మి పిక్చర్స్ అధినేత బాపిరాజు విడుదల చేస్తున్నారు. అయన చాలా గ్రాండ్ గా చిత్రాన్ని విడుదల చేస్తారు. కన్నడ నుంచి వచ్చిన చిత్రాలు అని విజయవంతం అయ్యాయి. ఈ చిత్రం తెలుగు కన్నడ భాషల్లో విడుదల అవుతుంది. మంచి విజయం సాదించాలి" అని కోరుకున్నారు.
 
ప్రసన్న కుమార్ మాట్లాడుతూ "దర్శకుడు సాగర్ గారి శిస్యుడు శ్రీనందన్. కరాళ తెలుగు కన్నడ లో విడుదల అవుతుంది. హీరో రవి శంకర్ ఉంటె సినిమా చాలా గ్రాండ్ గా ఉంటుంది. మంచి హిట్ అవాలి" అని కోరుకున్నారు. జబర్దస్త్ యాక్టర్  నవీన్ మాట్లాడుతూ "నేను ఫస్ట్ టైమ్ కన్నడ చిత్రంలో నటించాను. నా క్యారెక్టర్ బాగా వచ్చింది. ట్రైలర్ బాగుంది. ఏ చిత్రం మంచి విజయం సాదించాలి" అని కోరుకున్నారు.
 
నిర్మాత బోదాసు నర్సింహా మాట్లాడుతూ,  దర్శకుడు శ్రీనందన్ మంచి కథ చెప్పాడు, బాగా నచ్చింది, వెంటనే ప్రొడ్యూస్ సిద్ధం అని అనుకున్న. నా మిత్రుడు పిట్ల భాస్కర్ సహా నిర్మాతగా నాకు చాలా హెల్ప్ చేసాడు. మా కరాళ చిత్రం చాలా గొప్పగా వచ్చింది. తెలుగు కన్నడ లో విడుదల చేస్తున్నాం. అందరికి నచ్చుతుంది" అని ఆశించారు.
 
సహా నిర్మాత పిట్ల భాస్కర్ మాట్లాడుతూ "కరాళ చిత్రం బాగా నచ్చింది. నేను కో ప్రొడ్యూసర్ గా జాయిన్ అయ్యాను, సినిమా చూసాను, చాలా కొత్తగా మంచి సస్పెన్స్ తో ఉంటుంది. అందరికి బాగా నచ్చుతుంది" అని తెలిపారు.
సంగీత దర్శకుడు శ్రీ గురు మాట్లాడుతూ "ఈ చిత్రం లో మూడు పాటలు ఉన్నాయి. చాలా కొత్తగా ఉంటుంది. మంచి మ్యూజిక్ వచ్చింది., అందరికి ఈ సినిమా నచ్చితుంది" అని ఆశించారు.
 
నటుడు జెడి ఆకాష్ మాట్లాడుతూ "నా ఈ అవకాశం ఇచ్చిన నా దర్శకుడు నిర్మతల కి ధన్యవాదాలు. కరాళ చిత్రం చాలా డిఫరెంట్ కథ, లవ్ సైన్స్ మిస్టరీ ఈ  మూడు అంశాలు కలిసి ఉన్న కథ. షూటింగ్ చాలా బాగా జరిగింది. త్వరలో విడుదల అవుతుంది. నేను కన్నడ లో కొని సినిమాలు చేశాను కానీ తెలుగు లో ఇది నా మొదటి సినిమా. మీకు అందరికి నచ్చుతుంది అని ఆశిస్తున్నాను.
 
దర్శకుడు శ్రీనందన్ మాట్లాడుతూ "కరాళ చిత్రం సైంటిఫిక్ మిస్టరీ చిత్రం. చాలా ఇంటరెస్టింగ్ గా మంచి ట్విస్ట్స్ తో మంచి సంగీతం తో మంచి యాక్షన్ సన్నివేశాలతో చాలా కొత్తగా ఉంటుంది. కన్నడ లో 'బీగా' పేరుతో మార్చ్ 3న విడుదల చేస్తున్నాం. తెలుగు లో త్వరలో  విడుదల చేస్తున్నాం. సినిమా చాలా కొత్తగా ఉంటుంది. అందరికి నచ్చుతుంది" అని తెలియజేసారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాడి లవర్ వాడి ఇష్టమా.. సిగ్గుగా వుంది.. నాగశౌర్య ఘటనపై రష్మీ గౌతమ్