Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వాడి లవర్ వాడి ఇష్టమా.. సిగ్గుగా వుంది.. నాగశౌర్య ఘటనపై రష్మీ గౌతమ్ (video)

Advertiesment
Rashmi Gautam
, బుధవారం, 1 మార్చి 2023 (13:02 IST)
హైదరాబాదులో ప్రియురాలిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఓ యువకుడు నడిరోడ్డుపై యువతిపై చేజేసుకున్నాడు. దీన్ని చూసిన నటుడు నాగశౌర్య ఫైర్ అయ్యాడు. ప్రియురాలైనా సరే.. ఆమెను కొట్టడం సరికాదని.. ఆమెకు సారీ చెప్పాలని.. వాగ్వాదానికి దిగిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.
 
ఈ వీడియోను చూసిన వారంతా నాగశౌర్య చేసింది కరెక్టేనని చెప్తున్నారు. ఒక అమ్మాయి పట్ల ప్రియుడైనా, భర్త అయినా అలా నడుచుకోకూడదని కామెంట్లు పెడుతున్నారు. నాగశౌర్య ఓ యువతి దాడికి గురవుతుంటే ప్రియుడిని నిలదీయడం సరేనని వ్యాఖ్యానిస్తున్నారు. 
 
కానీ కొందరు నెటిజన్లు మాత్రం నాగశౌర్యపై విమర్శలు గుప్పిస్తున్నారు. లవర్స్ అన్నాక ఎన్నో వుంటాయని.. వాళ్ల విషయంలో తల దూర్చకూడదని కామెంట్స్ చేస్తున్నారు. ఈ పిచ్చి నెటిజన్ల వ్యాఖ్యలపై జబర్దస్త్ యాంకర్ రష్మీ కూడా మండిపడింది. 
 
"వాడి లవర్ వాడి ఇష్టమట. అమ్మాయిపై దాడి చేస్తే ప్రశ్నించడం తప్పా.. నాగశౌర్య వీడియో కింద వచ్చిన కామెంట్స్ చూస్తే సిగ్గుగా వుంది. ఆ అమ్మాయి ఎలాంటి ఒత్తిడిని అనుభవిస్తుందో ఎవరికి తెలుసు. మరో ఆత్మహత్య జరగడం కోసం మీరు ఎదురుచూస్తున్నారా..?" అంటూ రష్మీ గౌతమ్ ప్రశ్నించింది. దీంతో నెటిజన్లకు రష్మీ గౌతమ్ కాస్త షాకిచ్చిందనే చెప్పాలి. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓషో తులసీరామ్, సాయి ధన్సికల దక్షిణ చిత్రీకరణ పూర్తి