Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గద్వాల్ జయ,TRSకి ఆ వీడియో చూపించండి.. కిల్లర్ డాగ్స్- ఆర్జీవీ

Advertiesment
Ram Gopal Varma
, శుక్రవారం, 24 ఫిబ్రవరి 2023 (14:15 IST)
నాలుగేళ్ల బాలుడిని వీధి కుక్కలు చంపిన హైదరాబాదు అంబర్‌పేట ఘటనపై జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయ చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్రంగా స్పందించారు. 
 
తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఇలా రాసుకొచ్చారు.. ఆర్జీవీ. "హృదయాన్ని కదిలించే ఈ వీడియోను హైదరాబాద్ మేయర్ @గద్వాల్ జయTRSకి పదేపదే చూపించాల్సిన అవసరం ఉంది. ఆమెనే నిజమైన ప్యాక్ లీడర్ అని నేను చెబుతాను. కిల్లర్ డాగ్స్." అంటూ ఫైర్ అయ్యారు. 
 
"సార్ @KTRBRS దయచేసి మొత్తం 5 లక్షల కుక్కలను డాగ్ హోమ్‌గా మార్చండి. మేయర్ @గద్వాల్ విజయ TRSని వాటి మధ్యలో ఉండేలా చేయండి" అని ట్వీట్ చేశారు.
 
మరో ట్వీట్‌లో "కుక్కల బెడదను ఎదుర్కోవడానికి ప్రభుత్వం కేటాయించిన 18 కోట్లు ఎక్కడ? అంటూ ప్రశ్నించారు. ఈ ఘటనపై టీవీలో చర్చకు సిద్ధమని ప్రకటించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికాలో సందడి చేస్తున్న రామ్ చరణ్... అయ్యప్ప మాలను తొలగించిన చెర్రీ