Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కచ్చా బాదం పాటను పాడింది ఎవరు..?

Advertiesment
కచ్చా బాదం పాటను పాడింది ఎవరు..?
, బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (17:37 IST)
Kacha Badam
సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు 'కచ్చా బాదం' పాట వినిపిస్తూ ఉంది. కొందరు కచ్చా బాదం పాట మీద డ్యాన్స్ చేస్తున్నారు ఈ పాట పాడిన గాయకుడు భుబన్ బద్యాకర్ బాగా ఫేమస్ అయ్యాడు. బెంగాలీ భాషలో 'కచ్చా బాదం' అంటే 'పచ్చి వేరుశెనగ' అని అర్థం. 
 
బెంగాలీలో వేరుశెనగను బాదం అంటారు. ఏవైనా వస్తువులు అమ్మే వాళ్లు అనేక రకాల శబ్దాలు చేస్తూ ఉంటారు. అయితే భుబన్ బద్యాకర్ తన వేరుశెనగలను విక్రయించడానికి పాటలు పాడుతూ కస్టమర్లను ఆకర్షిస్తూ ఉంటారు. ప్రజలు అతని శైలిని ఇష్టపడ్డారు. అతని వీడియో సోషల్ మీడియాలో భారీగా వైరల్ అయింది. 
 
పశ్చిమ బెంగాల్‌కు చెందిన వేరుశెనగ విక్రయదారుడు భుబన్ బద్యాకర్ స్వయంగా 'కచ్చా బాదం' పాటను కంపోజ్ చేశాడు. ఈ పాట బెంగాల్ గిరిజన బౌల్ జానపద పాట ఆధారంగా రూపొందించబడింది. 
 
భుబన్ బీర్భూమ్ జిల్లా దుబ్రాజ్‌పూర్ బ్లాక్ పరిధిలోని కురల్జూరి గ్రామ నివాసి. భుబన్ పాటను రీమిక్స్ చేసి తెగ వైరల్ చేస్తూ ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"30 రోజుల్లో ప్రేమించడం ఎలా" అని నేర్పించింది.. అకౌంట్ హ్యాక్ అయ్యిందట!