''నువ్వు ఇంక ఇంటికి వెళ్లవా.. తిండి నిద్రా అన్నీ ఇక్కాడేనా''?- జూనియర్ ఎన్టీఆర్

ఆదివారం, 26 జనవరి 2020 (18:45 IST)
జూనియర్ ఎన్టీఆర్ ఓ స్టిల్ ఫోటోగ్రాఫర్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్టిల్ ఫోటోగ్రాఫర్‌ను జూనియర్ ఎన్టీఆర్ మెచ్చుకున్నాడు. ''నువ్వు ఇంక ఇంటికి వెళ్లవా.. తిండి నిద్రా అన్నీ ఇక్కాడేనా''? అంటూ తనపై ఫ్లాష్‌లు మెరిపించిన వెంటనే ఆ ఫోటోగ్రాఫర్‌ను పిలిపించి మరీ అడిగాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ప్రపంచవ్యాప్తంగా అశేష అభిమానుల్ని సంపాదించుకున్నాడు. ఇక జర్నలిస్టుల్లోనూ అతడంటే అభిమానించే వారు ఎక్కువే. ఫోటోజర్నలిస్టులు అతడితో సన్నిహితంగా ఉంటారు. అభిమానులు, ప్రజలు బాగుండాలని కోరుకునే వారిలో జూనియర్ ఎన్టీఆర్ ముందుంటాడు. అలా అంతర్జాతీయ విమానాశ్రయంలో తనపై ఫోటోల కోసం పడి పడి ఫోటోలు తీసే స్టిల్ ఫోటోగ్రాఫర్‌ను ఆప్యాయంగా పిలిచి అతనితో సరదాగా మాట్లాడాడు. 
 
ఇకపోతే.. జక్కన్న రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ల కాంబోలో తెరకెక్కిస్తున్న భారీ హిస్టారికల్ మల్టిస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్, ఇప్పటికే 85 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు సినిమా పరిశ్రమతో పాటు పలువురు కోలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమలకు చెందిన నటులు నటిస్తున్నారు.
 
డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య అత్యంత భారీ ఖర్చుతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. ఇకపోతే నేడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ మొత్తం కలిసి ఈ వేడుకను ఎంతో గొప్పగా జరుపుకున్న ఫోటోలను ఆ మూవీ యూనిట్, కాసేపటి క్రితం తమ అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్స్ లో ఫోటోలు పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Jr NTR recognises a paparazzi photographer & asks his howabouts. How kind & generous, he is!

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం మొబైల్ ఫోన్ చేతిలో వుంటే.. ఆ పనికి గంట.. లేకపోతే.. 2 నిమిషాలు?