జూనియర్ ఎన్టీఆర్ షూటింగ్ సమయంలో స్వల్పంగా గాయపడ్డారు. దీంతో ఆయన రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. అయితే ఆయన పరిస్థితి నిలకడగానే వుందని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సినీ యూనిట్ తెలిపింది.
వైద్య సలహా మేరకు, పూర్తిగా కోలుకోవడానికి ఆయన రాబోయే రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకుంటారు. అభిమానులు, మీడియా, ప్రజలందరూ ఎలాంటి ఊహాగానాలకు లోనుకాకుండా సహకరించాలని మనస్పూర్తిగా కోరుతున్నామని ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి ప్రకటన వచ్చింది. దీంతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
ఇటీవల బాలీవుడ్ చిత్రం వార్-2లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన సంగతి తెలిసిందే. కాగా హైదరాబాద్లో ఓ ప్రైవేట్ యాడ్ షూటింగ్లో పాల్గొనగా చిన్న ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆయన కాలికి స్వల్ప గాయమైనట్లు సమాచారం.
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ పలు వ్యాపార కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. మెక్ డొనాల్డ్స్, మలాబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, గ్రీన్ ప్లే, జెప్టో, ఆప్పీ ఫిజ్, ఫ్రూటీ లాంటి ప్రముఖ బ్రాండ్లను ఎండార్స్ చేస్తున్నారు. ఒవైపు సినిమాలు చేస్తూనే యాడ్స్లోనూ చురుగ్గా ఉంటున్నారు.