Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతిరత్నాలు సినిమా కలెక్షన్ ఎంతో తెలిస్తే షాకే..?

Advertiesment
జాతిరత్నాలు సినిమా కలెక్షన్ ఎంతో తెలిస్తే షాకే..?
, శనివారం, 20 మార్చి 2021 (13:05 IST)
చూడ్డానికి సిల్లిగా కనిపిస్తున్నారని వారిని తేలిగ్గా తీసుకోకండి.. మేమే ఒరిజినల్ డైమండ్స్ అంటున్నారు జాతిరత్నాలు. వసూళ్ళ లెక్కలు చూస్తుంటే ఆ ముగ్గురు మామూళోళ్ళు కారేమోనన్న క్లారిటీ కూడా వస్తోంది. జాతిరత్నాల చేతిలో ఓడిపోయిన వారి సంఖ్య చాలా పెద్దది. 
 
ఓ చిన్న కథ. అంతకంటే చిన్న చిన్న ఆర్టిస్టులు. పబ్లిసిటీతో కలిపి పెట్టిన ఖర్చు జస్ట్ ఆరున్నర కోట్లు. కానీ సినిమాకు వచ్చిన విపరీతమైన హైప్‌తో అన్ని కార్నర్స్‌కు కనెక్టయ్యే కామెడీతో అన్ని రికార్డుల వేటను షురూ చేస్తోంది. వీకెండ్ దాటినా బలంగానే కనిపిస్తున్నారు జాతిరత్నాలు.
 
కేవలం ఆరురోజుల్లో 44 కోట్ల గ్రాస్‌తో దూసుకువెళుతోంది జాతిరత్నాలు సినిమా. డిజిటల్, శాటిలైట్ రైట్స్ కలిపితే ఆల్రడీ 50 కోట్ల క్లబ్‌లో చేరిందనేది స్వయంగా ప్రొడ్యూసర్లే తేల్చిన లెక్క. కోవిడ్ తరువాత రిలీజ్ అయిన మూవీల్లో మేజర్ మూవీగా నిలిచింది జాతిరత్నాలు.
 
ఓవర్సీస్‌లో అయితే బడాబడా జాతిరత్నాల మూవీలే తేలిపోయాయి. అబ్రాడ్ స్క్రీన్లో అయితే 0.7 మిలియన్లు.. దాదాపు 5 కోట్లు వసూలు చేసింది జాతిరత్నాలు మూవీ. స్టార్ వాల్యు ఉన్న మాస్టర్, లోకల్‌లో హైప్ క్రియేట్ చేసిన క్రాక్ మూవీలు రెండూ కూడా జాతిరత్నాల ముందు బోల్తాపడ్డాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'చీకటి గదిలో చితక్కొట్టుడు' నటికి కరోనా పాజిటివ్