Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతి రత్నాలు సీక్వెల్ సిద్ధ‌మ‌వుతోంది‌

Advertiesment
Jaatiratnalu
Jaatiratnalu sucessmeet
నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ - ప్రియదర్శి ప్రధాన పాత్రలతో తెరకెక్కుతున్న చిత్రం 'జాతిరత్నాలు`. అనుదీప్ కేవీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ నిర్మాత‌గా ప‌రిచ‌య మ‌వుతున్నారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ క్రమంలో చిత్రయూనిట్ విజయోత్సవ కార్యక్రమాన్ని చేపట్టింది. హైదరాబాద్‌లో జరిగిన జాతిరత్నాలు సక్సెస్ మీట్‌లో నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, నరేష్, ఫరియా, అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.
 
నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ.. ‘మీ రెస్పాన్స్ చూసి నాకు గూస్ పింపుల్స్ వస్తున్నాయి. ప్రమోషన్స్‌లో మేమే కనిపిస్తాం. మేం కనిపించే జాతి రత్నాలు.  కానీ నాగ్ అశ్విన్, ప్రియాంక, స్వప్నాలే నిజమైన జాతి రత్నాలు. అనుదీప్ జీవితాన్ని చదివాడు. చాలా గట్టిగా మానవత్వం నేర్చుకున్నాడు. దాని కంటే పెద్ద డిగ్రీ లేదు. ఇది మా అందరికీ ఎంతో ముఖ్యమైన సినిమా. దర్శకుడు అనుదీప్ నాకు ఓ సోదరుడు లాంటివాడు. మొదటి సినిమానే అయినా కూడా ఫరియా అద్భుతంగా నటించింది. నరేష్ గారిని చూసి ఎంతో నేర్చుకున్నాం. మా సినిమాలో భాగస్వామి అయినందుకు నరేష్ గారికి థ్యాంక్స్. రదన్ తన సంగీతంతో ప్రాణం పోశాడు. చాలా రోజుల తరువాత ఎంతో నవ్వామని ఎయిర్ పోర్ట్‌లో ఓ సెక్యూరిటీ గార్డ్ చెప్పిన మాటలకంటే పెద్ద బ్లాక్ బస్టర్ ఏది ఉండదు. ఎంతో మంది ఆశీస్సులతో ఈ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఏజెంట్‌గా ఒప్పుకున్నారు.. చిచోరేలో యాసిడ్ అంటే ఒప్పుకున్నారు.. ఇప్పుడు జోగిపేట్ శ్రీకాంత్ అంటే కూడా ఓకే అన్నారు. ఈ ప్రేమ, సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి. హీరోది ఏ ఫ్యామిలీ అంటే మీ(ఆడియెన్స్) ఫ్యామిలీ అని చెప్పండి. ’ అని అన్నారు. ఇక స్టేజ్ మీదే దర్శకుడు, హీరోలు అందరూ కలిసి జాతి రత్నాలు సీక్వెల్ గురించి ప్రకటించేశారు. త్వరలోనే జాతి రత్నాలు సీక్వెల్ ఉంటుందని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆక‌ట్టుకోలేని `మోస‌గాళ్ళు`