Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హృతిక్ రోషన్‌తో పిల్లలు కనేందుకు రెడీ... అది కావాలి: మహిళా క్రికెటర్

హృతిక్ రోషన్‌తో పిల్లలు కనేందుకు రెడీ... అది కావాలి: మహిళా క్రికెటర్
, సోమవారం, 7 అక్టోబరు 2019 (14:29 IST)
హృతిక్ రోషన్‌తో పిల్లలు కనేందుకు సిద్ధంగా వున్నట్లు తమిళనాడుకు చెందిన మహిళా క్రికెటర్ భావన వెల్లడించింది. తనకు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ స్పెర్మ్ కావాలని చెప్తోంది. 'వార్' సినిమా చూసి హృతిక్ రోషన్‌పై తెగ ప్రేమ పెంచేసుకుంది ఈ క్రికెట్ భామ. 
 
అందుకే హృతిక్ రోషన్‌తో తనకు సంతానం కావాలన్నట్లు ప్రకటన చేసింది. హృతిక్ రోషన్ వార్ సినిమాలో తనకు విపరీతంగా నచ్చేసాడని అందుకే ఏకంగా హీరో స్పెర్మ్ కావాలని బహిరంగంగా చెప్పేసింది. ప్రస్తుతం ఈ ప్రకటన హాట్ టాపిక్‌గా మారింది. 
 
తను వార్ సినిమా చూస్తున్నంత సేపు కేవలం హృతిక్ రోషన్‌ను మాత్రమే చూస్తూ ఉండిపోయినట్లుగా చెప్పుకొచ్చింది భావన. తనకు అంత నచ్చేసిన ఈ బాలీవుడ్ హీరో పైన తనకు ఉన్న ప్రేమను మామూలు రీతిలో వ్యక్తపరిస్తే గుర్తింపు రాదని అనుకుందో ఏమో కానీ ఏకంగా అతని స్పెర్మ్‌ను అడిగేసింది. 
 
ఆమెకు కూడా హృతిక్ రోషన్ లక్షణాలు, దేహ దారుడ్యం ఉన్న పిల్లలు పుడతారనే ఆశతో ఈ ప్రకటన చేసి వుండొచ్చునని చెప్పుకొచ్చింది. మరి ఈ ప్రకటనపై హృతిక్ రోషన్ ఎలా స్పందిస్తాడో లేదో వేచి చూడాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#VenkyMama లుక్ అదిరింది.. మీరూ చూడండి