నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై కేసు నమోదు అయింది. గతంలో పలు దఫాలుగా పలువురు ఆయనపై కోర్టులో కేసు వేశారు. చెక్ బౌన్స్ కేసులో ఆయన అరెస్ట్ అయి తిరిగి బయటకు వచ్చారు. తాజాగా ఫిలిం నగర్ రోడ్డు నెంబర్–7లో నివాసం ఉంటున్న శివ ప్రసాద్ అనే వ్యక్తి కేసే వేశాడు. కొంతకాలంగా తన ఇంటికి తాళం వేసి బంధువుల వద్దకు వెళ్ళిన శివ ప్రసాద్.
మూడు రోజుల క్రితం ఆ తాళం పగలగొట్టి, ఇంట్లో ఆస్తులు, గోడలు ధ్వంసం చేసి, ఇంటిని ఆక్రమించేందుకు యత్నించిన బెల్లంకొండ సురేష్ ఆయన అనుచరులు దాడి చేశారు. అనంతరం ఆయన ఇంటికి వచ్చి ధ్వంసమైన వస్తువులను చూసి విషయం తెలుసుకొని, తన సిబ్బందిని బెల్లంకొండ సురేష్ ఇంటికి బాధితుడు శివ ప్రసాద్ పంపారు.
శివ ప్రసాద్ సిబ్బందిపై అసభ్యకరంగా దూషిస్తూ దాడికి బెల్లంకొండ సురేష్ యత్నించారు. దీంతో ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో బెల్లంకొండ సురేష్‌పై ఫిర్యాదు చేసిన శివ ప్రసాద్.. కేసు నమోదు చేసిన పోలీసులు.