Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేరం చేసింది నేను కాదు.. నేను ఒంటరిగా లేను: భావన

Advertiesment
నేరం చేసింది నేను కాదు.. నేను ఒంటరిగా లేను: భావన
, మంగళవారం, 11 జనవరి 2022 (10:44 IST)
ప్రముఖ మలయాళీ నటి భావన ఎట్టకేలకు తన వ్యక్తిగత జీవితంలో జరిగిన అత్యంత వివాదాస్పద సంఘటన గురించి మాట్లాడింది. 2017లో ఒక సినిమా షూటింగ్‌ని పూర్తి చేసుకుని భావన తన ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు, ఆమెను కిడ్నాప్ చేసి రెండు గంటలకు పైగా దాడి చేశారు. ఇప్పట్లో సంచలనం సృష్టించింది. 
 
తాజాగా సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘ పోస్ట్‌ను భావన షేర్ చేసింది. ఇది అంత తేలికైన ప్రయాణం కాదని.. బాధితురాలి నుంచి ప్రాణాలతో బయటపడే ప్రయాణం. ఐదేళ్ల తనపై జరిగిన దాడి.. తన గుర్తింపు అణచివేయబడింది. 
 
నేరం చేసింది తాను కానప్పటికీ, తనను అవమానపరచడానికి, మౌనంగా ఉంచడానికి, ఒంటరిగా చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ అలాంటి సమయంలో తన గొంతును సజీవంగా ఉంచడానికి ముందుకొచ్చిన వారు ఉన్నారు. ఇప్పుడు తాను చాలా గొంతులు వింటున్నాను. న్యాయం కోసం ఈ పోరాటంలో తాను ఒంటరిగా లేనని తనకు తెలుసునంటూ తెలిపింది భావన. 
 
"న్యాయం గెలవాలని, తప్పు చేసిన వారికి శిక్ష పడేలా చూడాలని, మరెవరికీ అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు నేను ఈ ప్రయాణం కొనసాగిస్తాను. నాతో పాటు నిలబడిన వారందరికీ మీ ప్రేమకు హృదయపూర్వక ధన్యవాదాలు" అంటూ రాసుకొచ్చింది భావన.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

RGV: బర్నింగ్ ఇష్యూలో దూరి మరోసారి తనవంతు ట్రెండ్ సృష్టించుకున్న వర్మ