నిర్లక్ష్యంగా బండిని నడిపిన డ్రైవర్‌కు 190 ఏళ్ల జైలు శిక్ష విధించింది మధ్యప్రదేశ్ కోర్టు. బస్సు ప్రమాదంలో 22 మంది సజీవదహనానికి కారణమైన ఆ డ్రైవర్‌కు 190 ఏళ్ల జైలు శిక్ష పడటం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
ఈ ప్రమాదానికి బస్సు యాజమాన్యం నిర్లక్ష్యం కూడా ఉందని తేల్చిన కోర్టు.. ప్రమాద సమయంలో తప్పించుకునేందుకు ఉండాల్సిన అత్యవసర ద్వారం మూసివేశారని.. అక్కడ అదనపు సీటు ఏర్పాటు చేయడంతో.. బాధితులు తప్పించుకోవడానికి వీలు లేకుండా పోయినట్టు పేర్కొంది.
ఇక, నిర్లక్ష్యంగా బస్సు నడిపి ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌కు 10 ఏళ్ల చొప్పున 19 విడతలుగా జైలులో గడపాలని తీర్పు వెలువరించింది.. అంటే.. 19 విడతలుగా పదేల్ల చొప్పున అంటే.. 190 ఏళ్ల జైలు శిక్ష విధించింది.