Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

RGV: బర్నింగ్ ఇష్యూలో దూరి మరోసారి తనవంతు ట్రెండ్ సృష్టించుకున్న వర్మ

Advertiesment
Varma meeting with Minister Nani
, సోమవారం, 10 జనవరి 2022 (21:31 IST)
గత వారం అంతా అటు సోషల్ మీడియాలో ఇటు టీవీ ఛానళ్లలో సినిమా టిక్కెట్ల ధరలపై దుమ్ము రేపిన RGV చివరికి సీమటపాకాయ్ మాదిరిగా తుస్ మనిపించారు. మంత్రి నానితో సమావేశమయ్యాక అందరూ మాట్లాడినట్లే... నేను చెప్పాల్సింది చెప్పాను, ఆనక ప్రభుత్వం ఇష్టం అని మీడియాకు చెప్పేసి వెళ్లిపోయారు.

 
మొత్తానికి బర్నింగ్ ఇష్యూలో దూరి మరోసారి తనవంతు ట్రెండ్ సృష్టించుకుని సినిమా టిక్కెట్ల వ్యవహారాన్ని ఎక్కడ వున్నదో అక్కడే వదిలేసి వెళ్లారు వర్మ. అసలు సినీ ఇండస్ట్రీలో చాలామందికి వర్మ మాటలపై నమ్మకం అంతగా వుండదు. 

 
కానీ ఏదో సీరియస్‌గా రంగంలోకి దిగారనీ, వర్మ దెబ్బకి ఏపీ ప్రభుత్వం తక్షణమే తన జీవోను ఉపసంహరించుకుంటుందని అనుకున్నవారు లేకపోలేదు. కానీ వర్మ అంటే అంత ఈజీగా ఎవ్వరికీ అర్థంకారు కదా. మరి మంత్రిగారితో వర్మ ఏం చెప్పారో.... ఫలితం ఎలా వుంటుందో వేచి చూడాల్సిందే. మరి ఈలోపు మళ్లీ వర్మ తన ట్విట్టర్ పేజీకి ఏమయినా పనికల్పిస్తారేమో ఎదురుచూద్దాం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుష్ప జోరు తగ్గలేదే.. కరోనాలో కలెక్షన్ల వర్షం.. శ్రీదేవి కుమార్తె కితాబు