బాలకృష్ణ హీరోగా 105వ సినిమా ప్రారంభం.. పోస్టర్ రిలీజ్

ఆదివారం, 1 సెప్టెంబరు 2019 (12:43 IST)
నందమూరి బాలకృష్ణ హీరోగా 105వ సినిమా ప్రారంభం కానుంది. హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌పై కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో సి.కల్యాణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల థాయ్‌లాండ్‌లో తొలి షెడ్యూల్ పూర్తయ్యింది. 
 
సెప్టెంబర్ 5 నుండి హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో లెంగ్తీ షెడ్యూల్ ప్రారంభమవుతుంది. ఈ సినిమాలో పూర్తిగా స్టైలిష్ లుక్‌లో కనిపించారు. ''జైసింహా'' వంటి విజయవంతమైన చిత్రం తర్వాత ఈ హిట్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న రెండో చిత్రమిది. 
 
వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలను తెలియజేస్తూ రెండు పోస్టర్స్‌ను యూనిట్ విడుదల చేసింది. సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్‌, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం నాగార్జునలా కాదు నేను, నా మాటే శాసనం: 'బిగ్ బాస్' హోస్ట్ శివగామి(video)