ప్రముఖ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో యూట్యూబ్ హోస్టెస్ అరియానా గ్లోరీ పాల్గొంది. గత సంవత్సరం ఏమాత్రం అంచనాలు లేకుండా బిగ్ బాస్‌లోకి వెళ్ళి మంచి క్రేజ్ దక్కించుకుని బయటకు వచ్చింది అరియనా. అంతకుముందు యాంకర్ గా రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో పాపులర్ అయిన ఈ భామ.. గట్టిగానే విమర్శలను కూడా ఎదుర్కొంది. ఆ బోల్డ్ ఇంటర్వ్యూపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు.
ఈ యంగ్ బ్యూటీ ప్రస్తుతం బిగ్ బాస్ బజ్ టాక్ షోకి హోస్ట్ చేస్తోంది. ఇందులో ఆమె ఎలిమినేటెడ్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌తో ఇంటరాక్ట్ అయ్యి వారి నుంచి వివాదాస్పద విషయాలను రాబట్టడానికి చూస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఆమె ఓ కొత్త కారును కొన్నట్లు తెలుస్తోంది.
"బిగ్ బాస్" బ్యూటీ అరియనా కొత్త కారు కొనేసింది. షోరూమ్లో తన పక్కన ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన స్టైలిష్ బ్లాక్ 4-వీలర్ కొత్త కియా కారులో బిగ్ బాస్ హౌస్‌మేట్, నటుడు సోహెల్, స్నేహితుడు, టీవీ నటుడు అమర్‌దీప్‌తో కలిసి మొదటి లాంగ్ డ్రైవ్‌కి వెళ్లారు.