తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన కొందరు హీరోలకు ఫ్యాన్సీ నంబర్లు అంటే అమితమైన మోజు. అలాంటి వారిలో హీరో జూనియర్ ఎన్టీఆర్ మొదటివరుసలో ఉంటారు. తాజాగా ఆయన ఓ ఫ్యాన్సీ నంబరు కోసం ఏకంగా రూ.17 లక్షలను ఖర్చు చేశారు.
ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్, ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ కార్యాలయంలో సెంట్రల్ జోన్ పరిధిలో కొత్త సిరీస్ నంబర్లకు బుధవారం వేలంపాట జరిగింది. పాత సిరీస్‌లోని చివరి నంబరైన టీఎస్09ఎఫ్ఎస్ 9999ను హీరో జూనియర్ ఎన్టీఆర్ కొనుగోలు చేశారు. బుధవారం జరిగిన వేలంపాటలో మొత్తం రూ.45.53 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.
సెంట్రల్ జోన్ పరిధిలో రిజిస్టర్ అయిన నంబర్లకు బుధవారం వేలం వేశారు. అత్యధికంగా టీఎస్09ఎఫ్ఎస్ 9999 నంబర్‌ను రూ.17 లక్షలకు జూనియర్ ఎన్టీఆర్ చేజిక్కించుకోగా టీఎస్09 ఎఫ్‌టీ 0001 నంబర్‌ను లహరి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.7.01 లక్షలు వెచ్చించి సొంతం చేసుకుంది.